Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉచితంగా కిడ్నీ ఆర్ఎఫ్టీ పరీక్షలు
- ఉచిత వైద్య సేవలు మరింత ఆరోగ్యాన్ని కాపాడతాయి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
ప్రతి నెలా నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపు జిల్లా వ్యాప్తంగా పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉందని, రాబోయే కాలంలో ప్రతి నెలా ఒక ప్రత్యేకమైన హెల్త్ డాక్టర్ తో ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. శనివారం మంచికంటి భవన్ లో సిపిఎం ఖమ్మం టూ టౌన్ కమిటీ, బోడేపూడి విజ్ఞాన కేంద్రం ( బివికే ) ఆధ్వర్యంలో బిపి, షుగర్ మెడికల్ క్యాంపు విజయవంతం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి జీవితంలో ఆరోగ్యం కాపాడుకోవడం ఒక ముఖ్యమైన బాధ్యత అని, అనారోగ్యం బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన ఉందని పేర్కొన్నారు. మనిషికి చదువు, ఆరోగ్యం ఉండటం ద్వారా మంచి సమాజం ఏర్పడుతుందని తెలిపారు. ప్రతి నెలా ఒక ప్రత్యేకమైన హెల్త్ డాక్టర్ తో ఉచితంగా వైద్య శిబిరాన్ని నడుపుతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్‌ను మరింత బలోపేతం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ లో ఖాళీ గా ఉన్న డాక్టర్ పోస్ట్ లను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రముఖ కిడ్నీ, డయాలసిస్ డాక్టర్ యాలముడి మనోజ్ మాట్లాడుతూ ఘగర్ వ్యాధి ఉన్న వారు కిడ్నీ పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, ఆహార అలవాట్లు విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వందలాది మందికి ఉచితంగా ఆర్ఎఫ్టీ పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షలు, షుగర్, బిపి సేవలను ఉచితంగా నిర్వహించారు. అనంతరం బిపి షుగర్ కు నెలకు సరిపడా మందులు అందించారు. ప్రముఖ డాక్టర్ సి.భారవి, డాక్టర్ రావిళ్ళ రంజిత్, డాక్టర్ కొల్లి అనుదీప్, డాక్టర్ పి.సుబ్బారావు, డాక్టర్ జెట్ల రంగారావు పేషెంట్లను పరీక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్, నాయకులు వై.శ్రీనివాసరావు, బోడపట్ల సుదర్శన్, ఎం. సుబ్బారావు, పి.ఝాన్సీ, అఫ్జల్, వాసిరెడ్డి వీరభద్రం, నర్రా రమేష్, కాంపాటి వెంకన్న, కళ్యాణం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.