Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మంలోని వివిసి షో రూమ్ లో ఖమ్మం డిటిఓ కిషన్ రావు శనివారం ఖమ్మం మార్కెట్లోకి మహీంద్ర న్యూ బొలెరో మాక్స్ పికప్ హెచ్డీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహీంద్ర వాహనం మార్కెట్ లోకి రావడం వాణిజ్య విభాగ కస్టమర్లకు చాలా ఉపయోగ పడుతుందన్నారు. అర్హత గల వారందరు దళితబందు ఉపయోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటపుడు సీట్ బెల్ట్డ్ తప్పకుండ పెట్టుకోవాలని, డ్రైవింగ్ చేసేటపుడు సెల్ ఫోన్ మాట్లాడవద్దని, ఆల్కహాల్ సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. ఈ వాణిజ్య వాహన డ్రైవర్లు చాలా దూరం ప్రయాణిస్తారని, అందువల్ల రాత్రి పన్నెడు తరువాత నిద్ర అనిపిస్తే వెంటనే బండి ఆపి రెస్ట్ తీసుకుని వెళ్లాలని, ఎందుకంటే ప్రతి డ్రైవర్ పై ఆ కుటుంబం ఆధారపడి ఉంటుందని చెప్పారు. ప్రతిఒక్కరు రవాణా నిబంధనలు పాటించాలి, వాహనాల అన్ని పేపర్లు ఫోర్స్‌లో ఉంచుకోవాలని, లైసెన్స్ లేకుండా వాహనం నడప వద్దని చెప్పారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. మహీంద్ర కంపెనీ వారు కస్టమర్ సేఫ్టీ మరియు మైలేజ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని, ఈ కొత్త వాణిజ్య వాహనం బొలెరో పికప్ హెచ్డి చాలా స్పెసీ గా ఉన్నదని డ్రైవర్ కాకుండా ఇంకా ఇద్దరు కూర్చోవడానికి అనుమతి ఉన్నదని, 80 హెపి, 10 ఫీట్ బాడీ, రెండు టన్నుల కెపాసిటీ తో , 20 వేలు కిలోమీటర్లు వరకు సర్వీస్ అవసరం లేదని అని అన్నారు. ముఖ్యంగా ఈ వాహనంనకు లైవ్ ట్రాకింగ్ వ్యవస్థ ఉన్నదని, 16 ఇంచుల టైర్స్‌తో ఉందని అన్నారు. వివిసి మోటార్స్ సర్వీస్ విషయంలో సుమారు 5 స్టార్ రేటింగ్ తో ఉన్నామని, ఇది మాకు ఎంతో గర్వకారణమని అన్నారు. త్వరలో మా వివిసి కస్టమర్స్ కోసం సెంట్రల్ కాల్ సెంటర్ పెడుతున్నామని, తెలంగాణాలో మా వివిసి వర్కుషాప్ క్విక్ సర్వీస్ పెడుతున్నామని వాణిజ్య వాహన యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమములో సంస్థ చైర్మన్ ద్రౌపతి, సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.