Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోళ్ళలో జాప్యంపై మంత్రి పువ్వాడ ఆగ్రహం
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణ, రవాణా చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. స్థానిక వీడీవోస్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, రవాణా కాంట్రాక్టర్లతో ధాన్య సేకరణపై మంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ, రవాణా పట్ల అధికారుల అలసత్వంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారని, రైతులు తమ ధాన్యాన్ని సేకరణ కేంద్రాలకు తీసుకువస్తే సేకరించకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా దాదాపు 2లక్షల పై చిలుకు కేంద్రాలు వస్తుందని అంచనా ఉందని, ఇప్పటి వరకు కేవలం 30వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరణ చేయడమేంటని మంత్రి ప్రశ్నించారు. ధాన్యం సేకరణ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందని, కొన్ని చోట్ల అకాల వర్షాల వల్ల ఆలస్యం అవుతుందని అధికారులు మంత్రికి వివరించారు. భారత ఆహార సంస్థ గోడౌన్ ల వద్ద కొంత ఆలస్యం జరుగుతుందని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు. ఎందుకు ఆలస్యం జరుతుందని అధికారులను నిలదీశారు. గోడౌన్ ల వద్ద నిల్వ సామర్థ్య లేదని, ధాన్యం సర్దుబాటు చేయడం వల్ల ఆలస్యమవుతున్నట్లు అధికారులు నివేదించారు. అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, రఘునాథపాలెం మండలం జింకల తండా వద్ద 20వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం ఉన్న గోడౌన్ ను వినియోగించుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ మేరకు ఎఫ్సిఐ జనరల్ మేనేజర్ తో ఫోన్ లో మాట్లాడి తక్షణమే నిల్వ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. జిఎం సానుకూలంగా స్పందించారు. రానున్న 3 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అకాల వర్షాలతో లపంటలు తడిసిపోవడంపై రైతులు ఆందోళనలో ఉన్నారని, ధాన్యం అమ్ముకునేందుకు ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారని అన్నారు. తడిసిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తామని మంత్రి రైతులకు భరోసానిచ్చారు. నాణ్యమైన ధాన్యానికి చెల్లించే ధరనే తడిసిన ధాన్యానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. జులై మొదటి వారంలోగా ధాన్య సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ప్రక్రియ లో భాగస్వామ్యం అవుతున్న వారందరితో వాట్సప్ గ్రూప్ ఏర్పాటుచేయాలని, ఏ దశలో ఎటువంటి సమస్య వచ్చినా తన దష్టికి తేవాలని ఆయన తెలిపారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసుధన్, డిఆర్డీవో విద్యాచందన, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి విజయకుమారి, జిల్లా రవాణా అధికారి తోట కిషన్ రావు, అదనపు డీసీపీ సుభాష్ చంద్ర బోస్, ఏసిపి గణేష్, జిల్లా సివిల్ సప్లై అధికారి రాజేందర్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ సోములు, ఏఎంటి వి నర్సింహారావు, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, జిల్లా మార్క్ ఫెడ్ మేనేజర్ పి. సునీత, రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వర రావు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు భద్రం, బోయపాటి వాసు, సత్యం బాబు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు ప్రతి నిత్యం ఉచిత వైద్యం అందించాలనే బస్తీ దవాఖాన
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
పేదలకు ప్రతి నిత్యం వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలని బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్థానిక 34వ డివిజన్లో రూ.27.50 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన, యోగ కేంద్రంను మంత్రి పువ్వాడ చేతుల మీద ప్రారంభించారు. కార్పొరేట్ స్థాయికి మించి ప్రభుత్వం వైద్య సేవలు, చికిత్సలు, శాస్త్ర చికిత్సలు ఆందిస్తుందని పేర్కొన్నారు. పేదలు, సామాన్యుల సౌకర్యార్థం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్ని అధునాతన సేవలు అందిస్తుందని వివరించారు. ప్రజలు ప్రభుత్వ వైద్యంను సద్వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, నగరం మేయర్ పునుకోల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, డిసిసిబి బ్యాంక్ చైర్మన్ నాగభూషణం, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఎంహెచ్వో మాలతి, బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, స్థానిక కార్పొరేటర్ రుద్రగాని శ్రీదేవి ఉపేందర్, ఆర్జేసి కృష్ణ, ఆశ్రీఫ్, తదితరులు పాల్గొన్నారు.