Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
మండల పరిధిలో చిరుమర్రి, వెంకటాపురం, మాదాపురం గ్రామాలలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నివాసాలను సందర్శించి కుటుంబసభ్యులు పరామర్శించి మృతి చెందిన వారి చిత్రపటాలకు పుష్పగుచ్చాలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రం రవాణా మంత్రి పువ్వాడ అజరు కుమార్ సిఫారస్ మేరకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి రూ.4,67,500 విలువైన 11 చెక్కులను బాధితులకు ఆయన అందజేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని లింగాల కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్, రైతు సమన్యయ సమితి మండల కన్వీనర్ పోట్ల ప్రసాద్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, వెంకటాపురం, చిరుమర్రి, పండేగుపల్లి గ్రామ సర్పంచులు కోటి అనంతరాములు, కానుగు సుజాత, ఓబినబోయిన అమరయ్య, ఉప సర్పంచ్ లు వినుకొండ రమేష్, కోడె బాబు, బిసి సెల్ మండల అధ్యక్షులు తోట ధర్మారావు, డిసిసిబి డైరెక్టర్ వేముల శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాలోజి గోవింద్, బంక మల్లయ్య, పచ్చా సీతారామయ్య, చెరుకుపల్లి బిక్షం పాల్గొన్నారు.