Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొగ్గుచూపుతున్న ఎమ్మెల్యే కందాళ
నవతెలంగాణ-తిరుమలయపాలెం
మండల రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పనిచేసిన చావా శివరామకృష్ణ ఆ పదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం అ పోస్టు మండలంలో ఖాళీగా ఉంది. ఈ పోస్టును భర్తీ చేసేందుకు పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. మండలంలోని రాజారం గ్రామానికి చెందిన కొప్పుల ఉపేందర్ రెడ్డిని ఈ పదవి వరించనున్నట్లు తెలిసింది. భారత రాష్ట్ర సమితి యువ నాయకుడుగా రాజారాం గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేదోడుగా వాదోడుగా ఉంటూ మండలంలో అనేకమంది రైతులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చి పరిష్కరించే విధంగా కృషి చేసిన వ్యక్తిగా ఉపేందర్ రెడ్డికి మంచి పేరు ఉంది. 2007 నుంచి కందాల ఉపేందర్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమలయపాలెం మండలంలో అనేక కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కందాల ఉపేందర్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారు. సౌమ్యుడుగా నమ్మకస్తుడిగా పేరున్న కొప్పుల ఉపేందర్ రెడ్డి ఈ పదవికి తగిన వ్యక్తిగా ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికలు దగ్గర పడుతుందో తనకు లక్ష రూపాయల జీతం వచ్చే సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి పాలేరు నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలతో సత్సంబంధాలు ఉండే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొప్పుల ఉపేందర్ రెడ్డికి ఈ పదవి ఇస్తే బాగుంటుందని మండల ప్రజలు భావిస్తున్నారు.