Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలేరు ఎమ్మెల్యే కందాళ
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఏదులాపురం, కొండాపురం గ్రామాల్లో ఒక్కో గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణానికి కందళా శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందళా మాట్లాడారు. వైద్య రంగాన్ని బలోపేతం చేయడం కోసం జిల్లాకోక మెడికల్ కళాశాలను మంజూరు చేసిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు. అన్ని రకాల వైద్య సౌకర్యాలు, పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి వృద్ధులకు, కంటి సమస్యలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లను ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉమ, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, సుడా డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, ఎంపీడీవో అశోక్ కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బెల్లం వేణు గోపాల్, వైద్య సిబ్బంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.