Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డివైఎఫ్ఐ జిల్లా కమిటీ అధ్వర్యంలో సమస్యలపై రైల్వే స్టేషన్ లో సర్వే
- సమస్యలకు నిలయంగా ఖమ్మం ప్రధాన రైల్వే స్టేషన్
వెంటనే జిల్లా ఎంపీ నామాకి పోన్ చేసిన జిల్లా నాయకత్వం
- స్పందించిన ఎంపీ నామ. నాగేశ్వరరావు
- సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ
- పరిష్కరించకుంటే ఆందోళనలు చేస్తాం
- డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్.బషిరుద్దిన్ డిమాండ్
నవతెలంగాణ- ఖమ్మం కార్పొరేషన్
సమస్యలకు నిలయంగా ఖమ్మం ప్రధాన రైల్వే స్టేషన్ మారిందని, మోడీ చెప్పిన స్వేచ్ భారత్ ఇదేనా...? సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ఆందోళనలు చేస్తాం అని డి.వై.యఫ్.ఐ జిల్లా కార్యదర్శి షేక్.బసీరుద్దిన్ డిమాండ్ చేశారు. స్థానిక ఖమ్మం రైల్వే స్టేషన్ లో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ అధ్వర్యంలో సమస్యలపై శనివారం సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం వెంటనే జిల్లా ఎంపీ నామ నాగేశ్వరరావుకి డి.వై.యఫ్.ఐ జిల్లా కార్యదర్శి షేక్.బసీరుద్దిన్ పోన్ చేయడంతో స్పందించిన ఎంపీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్.బసీరుద్దిన్ మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్ లో నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ పేరుతో ఇష్టానుసారంగా అన్ని వాహనదారుల నుండి బస్టాండ్ కంటే రైల్వే స్టేషన్ లో డబ్బులు వసూళ్లు చేస్తూ పార్కింగ్ లో సీసీ కెమెరాలు, పరిశుభ్రత కుడా లేదని ఆయన తెలిపారు. రైల్వే స్టేషన్ మొత్తం చెత్త చెదారంతో మంచినీరు తాగే దగ్గర ఈగెలు, దోమలు వాలుతు స్టేషన్ మొత్తం అపరిశుభ్రంగా ఉందనీ,ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్ ముందు ప్రక్కనే సెప్టిక్ ట్యాంక్ ఓపెన్ గా ఉంచారని తీవ్రమైన దుర్వాసన వస్తుందని, వెయిటింగ్ రూమ్స్‌ని అసలు క్లీన్ గా ఉంచడం లేదని ఆయన ఆరోపించారు. కంట్రాక్టర్స్ రైల్వే స్టేషన్ లో పనిచేసే సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వకుండ టార్గెట్స్ ఇస్తూ తీవ్రమైన శ్రమ దోపిడీ చేస్తున్నారని, స్టేషన్ ముందు ఉంచిన జాతీయ జెండా చాలా రోజుల నుండి ఊడిపోయిన, కనీసం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. మోడీ, బీజేపీ ప్రభుత్వం రైల్వే స్టేషన్ల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి సుందరికరిస్తున్నామని మాటలకే పరిమితం అయిందని,స్వేచ్ భారత్ పేరుతో హడావిడి చేయడమే తప్ప ఆచరణలో ఎక్కడ ఉందనీ ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్, శీలం వీరబాబు, జిల్లా నాయకులు కొంగరి నవీన్, కనపర్తి.గిరి, రామిశెట్టి.సురేష్, కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు బొట్ల.సాగర్, తదితరులు పాల్గొన్నారు.