Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలడుగు భాస్కర్, పోతినేని సుదర్శన్రావు
నవతెలంగాణ-ఖమ్మం
అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతుల వెంటనే ఆదుకోవాలని సిపిఎం పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జి పాలడుగు భాస్కర్, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం సిపిఎం పార్టీ ఆఫీసు నందు మధిర నియోజకవర్గం సమావేశం చింతలచెరువు కోటేశ్వరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల అకాల వర్షం వల్ల రైతులకు చేతికి వచ్చిన పంట తడిసినష్టం జరిగిందని, ఈ నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందించాలని, వర్షం వల్ల తడిసిన మొక్కజొన్న, వరి పంటలను వెంటనే కొనుగోలు చేయాలని, మొక్కజొన్న వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తడిసిన పంటను వెంటనే గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు, పంట నష్టానికి ఎకరానికి పదివేల రూపాయలు చెల్లిస్తానని హామీని అమలు పరచాలని కోరారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని వెంటనే అమలు పరచాలని, వరి కొనుగోలులో తరుగు శాతాన్ని తీసివేయాలని కోరారు, కేంద్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరతో పాటు, పండించిన పంటను వెంటనే కొనుగోలు చేసి, రైతులు ఖాతాలో వెంటనే డబ్బులు వేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు శీలం నరసింహారావు, బండి పద్మ, దొండపాడు వెంకటేశ్వరావు, మడిపల్లి గోపాలరావు, దివ్వల వీరయ్య, మండల కమిటీ సభ్యులు మండల కార్యదర్శిలు పూర్తికాలం కార్యకర్తలు పాల్గొన్నారు.