Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విప్, ఎమ్మెల్యే రేగా
నవతెలంగాణ-పినపాక
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శనివారం పినపాక మండలం ఉప్పాక గ్రామంలో సుమారు రూ.14 లక్షల అంచనా వ్యయంతో నిర్మించుకున్న పల్లె దవాఖానాను ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ పల్లె దవాఖానల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల ప్రజలపై ఆర్థిక భారం తగ్గిపోతుందన్నారు. గ్రామంలో పల్లె దవాఖానల ఏర్పాటుతో వైద్యపరంగా గ్రామ ప్రజలకు ఇబ్బందులు తొలగిపోతాయన్నారు.
ఈ పల్లె దవాఖానలతో ఉచితంగా వైద్య పరీక్షలు అదే స్థాయిలో మందులు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పక సర్పంచ్ సుజాత, ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఉపసర్పంచ్ రామారావు, డాక్టర్ దుర్గా భవాని, డాక్టర్ సింధూజ, బీఆర్ఎస్ జిల్లా నాయకులు భవాని శంకర్, దాట్ల వాసు బాబు, సహకార సంఘం చైర్మన్ రవిశేకర్ వర్మ,సొసైటీ డైరెక్టర్ కొండెరు రాము, రైతు సంఘం అధ్యక్షుడు దొడ్డ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.