Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-లక్ష్మీదేవి పల్లి
కొత్తగూడెం పట్టణానికి నేటి నుంచి నిరంతరాయంగా కిన్నెరసాని మంచినీటి సరఫరా చేయనున్నట్టు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం లక్ష్మీదేవి పల్లి మండలం కాల్వ తండాలో 45 కోట్లతో నిర్మించిన కిన్నెరసాని పంప్ హౌస్‌ను పరిశీలించి, పంప్ హౌస్ నుండి కొత్తగూడెం పట్టణానికి కిన్నెరసాని నీటి సరఫరాను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవిలో కొత్తగూడెం పట్టణానికి నిరంతరాయంగా కిన్నెరసాని నీటి సరఫరా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కొత్త పంప్ హౌస్ నిర్మాణం వలన నీటి సరఫరా అంతర ఏర్పడిందని ఇకముందు నీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగదని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ రఘు, లక్ష్మీదేవి పల్లి ఎంపీపీ శ్రీమతి భుఖ్య సోనా, కౌన్సిలర్లు కోలాపురి ధర్మరాజు, రుక్మైందర్ బండారి, బండి నరసింహా, అంబుల వేణు, బుక్య శ్రీను, బాలిశెట్టి సత్యభామ, కూరపాటి విజయలక్ష్మి, వనచర్ల విమల తదితరులు పాల్గొన్నారు.