Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల వాసులకు తీవ్ర గాయాలు
- ఎంపీ నామ, ఎమ్మెల్యే మెచ్చా తీవ్ర దిగ్భ్రాంతి
- క్షతగాత్రులతో ఫోన్లో మాట్లాడి ఓదార్చిన నామ
నవతెలంగాణ-చండ్రుగొండ
శ్రీశైలం ఘాట్ రోడ్డులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామానికి చెందిన భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... చండ్రుగొండ మండలం మద్దుకూరు, పెనగడప, దామరచర్ల అబ్బుగూడెం గ్రామానికి చెందిన, 70 మంది భక్తులు తమిళనాడులోని రామేశ్వరం దర్శనా నికి శుక్రవారం సాయంత్రం మద్దుకూరు నుంచి రెండు బస్సులో బయలుదేరారు. మార్గమధ్యంలో ఉన్న దైవ క్షేత్రాలను దర్శించుకునేలో భాగంగా శ్రీశైలం బయలుదేరారు. శ్రీశైలం ఘాట్‌లోని దయ్యాల మలుపు వద్ద బస్సు ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అయి అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘట నలో ముగ్గురివి చేతులు కాళ్ళు విరాగాయి. పలు వురు గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ నామా, ఎమ్మెల్యే మెచ్చా
బస్సు బోల్తా ఘటన పట్ల బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు, అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అక్కడి జిల్లా అధికారులకు హుటాహుటిన ఫోన్ చేసి, సంఘటన గురించిన సమగ్ర సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం, చికిత్స, బాధితులకు సాయం గురించి వైద్యాధికారులతోను, అధికార యంత్రాంగంతోనూ మాట్లాడారు. అదేవిధంగా ఘటన గురించిన సంపూర్ణ సమాచారాన్ని చండ్రుగొండ మండల బీఆర్ఎస్ అద్యక్షులు దారా బాబుకు నామా తెలియజేసి, అప్రమత్తం చేశారు.