Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఈ బిచ్చన్న
నవతెలంగాణ-మణుగూరు
సమిష్టి కృషితోనే విజయాలు సాధించవచ్చు అని భద్రాద్రి పవర్ ప్లాంట్ సీఈ బిచ్చన్న తెలిపారు. శనివారం టీఎస్ జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్ క్రికెట్ టోర్నమెంట్ కాకతీయ థర్మల్ ప్రాజెక్ట్ భూపాలపల్లిలో ఐదు రోజులు నిర్వహించారు. అన్ని విభాగాలలో ప్రతిభను కనుపరిచిన భద్రాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ క్రికెట్ జట్టు తృతీయ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా బీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ బి.బుచ్చన్న జట్టు సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమిష్టి కృషితోనే విజయాలు వస్తాయని అందరి కృషి ఫలితంగానే జెన్కో అన్ని సంస్థలలో కెల్లా అగ్రగామిగా నిలబడిందని తెలిపారు. క్రీడాకారులను సంస్థ ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటుందని, క్రీడాకారులు క్రీడలతో పాటు విధి నిర్వహణ కూడా అంతే బాధ్యతతో చేయాలని సంస్థను ముందుకు తీసుకుపోయేలా అందరి సహకారం శ్రమ కృషి అంకిత భావం క్రమశిక్షణ కలిగి ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు బహుమతిగా 2 క్రికెట్ బ్యాట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ అండ్ అడ్మినిస్ట్రేషన్ పార్వతి స్పోర్ట్స్ సెక్రటరీ జట్టు కెప్టెన్ కత్తి నరసింహారావు, మేనేజర్ ఎం.వాజేశ్వర్ రావు, సభ్యులు ఎల్.అశోక్ రెడ్డి, వి.కార్తీక్, పి.హేమ మూర్తి, డి.రమేష్, టి.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.