Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి సత్తుపల్లి జేవిఆర్ ఓసికి సంబంధించిన కోల్ కత్తా వారి సమంత కన్ స్ట్రక్ క్షన్ కన్వేయర్ బెల్ట్ ఏప్రిల్ 2022 సంవత్సరంలో ఏర్పాటు చేశారని ఒక సంవత్సరం కాక ముందే బెల్ట్ తెగిపోవడం తరచు బ్రేక్ డౌన్‌తో కంపెనీకి నష్టం కలుగుతుందని సరైన నిర్వాహణలేక బెల్ట్‌ని ఉపయోగించడం వల్లనే బొగ్గు ట్రాన్స్ పోర్ట్‌కు ఇబ్బంది కలుగుతుందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు అన్నారు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సమంత)లో, కిష్టారం, జేవిఆర్ ఓసిలో శనివారం కొత్తగూడెం బ్రాంచి కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన పిట్ మీటింగ్‌లో మంద నరసింహారావు మాట్లాడుతూ కార్మికులు తమ వద్దకు వచ్చి సుమారు రూ.450 కోట్లతో గత సంవత్సరం 2022లో నిర్మించిన కన్వేయర్ బెల్ట్ తరచు బ్రేక్ డౌన్ కావడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారన్నారు. సమగ్ర విచారణ జరిపించి ఈ నష్టానికి కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కిష్టారం నివాస కాలనీలో డ్రైనేజీ నిర్మాణం, మంచి నీటి ఆర్ఓ ప్లాంట్, అంతర్గత సిసి రోడ్లు నిర్మించాలని, కార్మికులు రాత్రుల్లు డ్యూటీకి వెళ్లి, వచ్చే సమయాల్లో భయబ్రాంతులకు గురౌతు న్నారని అందుకు స్మశాన వాటికకు ప్రహారిగోడ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కర్ల వీరాస్వామి, పిట్ బాధ్యులు బి.ప్రకాష్, కె.రమణ, సర్వేశ్వరరావు, ఎం.నాగరాజు, రాయల వెంకన్న, మంగ రమేష్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.