Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలో ఆయిల్ ఫామ్ లక్ష్యాన్ని సాధించాలి
- ధాన్యం కొనుగోలు నిల్వ లేకుండా మిల్లులకు తరలించాలి
- గ్రూప్ 1, 4 పరీక్ష నిర్మాణకు చర్యలు చేపట్టాలి
- కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-పాల్వంచ
ప్రభుత్వ ఉత్తర్వుల జీవో 76 ప్రకారం క్రమబద్ధీకరణను ఈనెల 10 వరకు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులు ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జీవో నెంబర్ 76 ఆయిల్ ఫామ్ పంట సాగు ఎరువుల సరఫరా ధాన్యం కొనుగోలు గ్రూప్ 1, 4 పరీక్ష నిర్మాణ తదితర అంశాలపై రెవెన్యూ రిజిస్ట్రేషన్ వైద్య ఉద్యాన వ్యవసాయ సహకార పౌర సరఫరాలు సంవత్సర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 76 ప్రకారం ఇల్లందులో 34 కొత్తగూడెంలో 76 పెండింగ్ దరఖాస్తులను రిజిస్ట్రేషన్లు చేపించారని అన్నారు. ఈ సంవత్సరం జిల్లాలో ఆయిల్ ఫామ్ పెద్ద ఎత్తున సాగు చేపట్టేందుకు 20 100 ఎకరాలు లక్ష్యాన్ని ప్రభుత్వం కేటాయించినట్లు చెప్పారు. లక్ష్యాన్ని సాధించేందుకు వ్యవసాయ ఉద్యాన అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. మరీ మిర్చి పంటలు సాగు చేస్తున్న రైతులను ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సహించాలని తెలిపారు. ఆల్ఫాం పంట సాగు చేపట్టేందుకు 200671 మంది రైతులు 10000 ఎకరాల్లో సాగు చేపడానికి సిద్ధంగా ఉన్నారని 326 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు 75 మంది రైతులు డీడీలు చెల్లించి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బిందు సేద్యం పరికరాలు ఏర్పాటుకు 87 మంది రైతులు 198 ఎకరాలకు డీడీలు చెల్లించినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు గురించి ప్రస్తావిస్తూ కాటా వేసిన తదుపరి ధాన్యం నిలువలు లేకుండా మిల్లులకు రవాణా చేయాలని మిల్లులకు తరలించాలన్నారు. వచ్చే నెల 11వ తేదీన గ్రూప్ 1, 15వ తేదీన జరగనున్న గ్రూప్ 4 పరీక్ష నిర్మాణపు సిబ్బందిని కేటాయించి విధులు నిర్వహణ ఉత్తరు జారీజారని డిఆర్ఓ ను ఆదేశించారు. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమై 69 రోజులు పూర్తవుతుందని రానున్న 31 రోజుల్లో ప్రతి ఒక్కరు కంటి పరీక్ష చేపించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్ఓ మధుసూదన్ రాజు, సహకార అధికారి వెంకటేశ్వర్లు, ఉద్యాన అధికారులు మరియన్న, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, పౌరసరఫరాల అధికారి మల్లికార్జున్, పౌరసరఫరాల శాఖ డిఎం శ్రీనాథ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, డీఆర్ఓ అశోక్ చక్రవర్తి, ఆర్డిఓ సన్నులత, కొత్తగూడెం, ఇల్లందు, పాల్వంచ మండలాల తహసిల్దార్లు శర్మ, కృష్ణవేణి, రంగాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.