Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -కూసుమంచి
మండలంలోని నాయకన్ గూడెం గ్రామంలో ఎస్సీ కాలనీకి నూతనంగా మంజూరైనా చౌక దుకాణం నెంబర్ -2 ను శనివారం గ్రామ సర్పంచ్ కాసాని సైదులు, వైస్ ఎంపిపి కంచర్ల పద్మావీరారెడ్డి సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నూతనంగా మంజూరైన చౌక దుకాణం షాపును డీలర్ తిప్పర్తి సైదులు నిర్వహించడం తమకెంతో సంతోషదాయకంగా ఉన్నదని, ఈ దుకాణాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉండి నిత్యవసర సరుకులు బియ్యం ప్రజలకు అందుబాటులో అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కిన్నెర శ్రీకాంత్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మండవ వీరనాగులు, మాజీ సర్పంచ్ కంచర్ల వీరారెడ్డి, మాజీ ఎంపిటిసి జహంగీర్ షరీఫ్, మాజీ వైస్ సర్పంచ్ గడ్డం మురళి, వార్డు మెంబర్ రెడ్డబోయిన సైదమ్మ, కష్ణం రాజు, ఖాసిం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.