Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైరా ఎమ్మెల్యే
నవతెలంగాణ-వైరా
సోమవరం నల్ల చెరువు నీటి ముంపునకు పదేపదే గురవుతున్న మునిసిపల్ 9వ వార్డు పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి భవిషత్లో నీటి ముంపు లేకుండా చేస్తానని వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ హామీ ఇచ్చారు. శనివారం 9వ వార్డు కౌన్సిలర్ సూర్య దేవర వింద్యా రాణి మునిసిపల్ కమిషనర్ పతాని వెంకటేశ్వర్లుతో ఇతర వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. నల్లచెరువు వాగు నీరు కొద్దిపాటి వర్షానికి కూడా ఇళ్లల్లోకి నీరు ప్రవహిస్తుందని.. దీంతో అభివృద్ధికి దూరంగా ఉన్నామని, తమ సమస్యను పరిష్కరించాలని కోరడంతో వెంటనే స్పందించిన వైరా ఎమ్మెల్యే వైరా మున్సిపల్ కమిషనర్‌ను వెంటనే అక్కడికి పిలిపించి తక్షణమే శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకోవాలని అందుకు కావలసిన నిధులను మంజూరు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బీడీకే రత్నం, వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు, బిఆర్ఎస్ పార్టీ వైరా పట్టణ అధ్యక్షులు మద్దెల రవి, మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు, జడ్పి కో ఆప్షన్ సభ్యులు షేక్ లాల్ అహ్మద్, పార్టీ మండల నాయకులు సూర్యదేవర శ్రీధర్, జిల్లా నాయకులు పసుపులేటి మోహన్ రావు, మచ్చ బుజ్జి, తదితరులు ఆయన వెంట ఉన్నారు. అనంతరం వివిధ వార్డుల్లో రకరకాల వ్యాధులు, రోడ్డు ప్రమాదాలలో గాయపడి బాధ పడుతున్న వారిని పరామర్శించారు.