Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరగా లబ్దిదారులకు అందజేయాలి : కలెక్టర్ గౌతమ్
నవతెలంగాణ-ఖమ్మం
బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచి, త్వరితగతిన లబ్దిదారులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శనివారం కలెక్టర్, మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలోని అల్లిపురం, వైఎస్సార్ నగర్ లో నిర్మిస్తున్న డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. అల్లిపురంలో 8 బ్లాకుల్లో 192 గృహాలను జి ప్లస్ 2 పద్దతిలో నిర్మాణాలకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. 168 గృహాల పనులు ప్రారంభించగా, ప్లాస్టటింగ్ దశకు చేరుకున్నట్లు తెలిపారు. బ్లాకుల వారిగా పనులు పూర్తిచేసి, పూర్తి అయిన బ్లాకులను వెంట వెంటనే అందజేయాలన్నారు. వైఎస్ఆర్ నగర్ లో 4 బ్లాకుల్లో జి-ప్లస్ 2 పద్ధతిలో 96 గృహాలు నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు. సమస్యలు ఉంటే దృష్టికి తేవాలని, ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం అధికారులు వ్యక్తిగత శ్రద్ధ వహించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో శిరీష, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, డిఇ చంద్రశేఖర్, డబల్ బెడ్ రూమ్ డిఇ టి.కృష్ణారెడ్డి, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.