Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 మంది విద్యార్థులు ఎంపిక
- విద్యార్థుల నైపుణ్యాల మెరుగు కోసం వర్క్ షాప్స్
- అనుబోస్ ఇంజనీరింగ్ చైర్మన్ డాక్టర్ భరత్ కృష్ణ
నవతెలంగాణ-పాల్వంచ
మున్సిపల్ పరిధిలోని అనుభూతి ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్ జరిగాయి. అనుబస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న ఈసీఈ సిఏసి, సివిల్, ఈఈఈ, మెకానికల్ 2022-2023 ఉత్తీర్ణులైన విద్యార్థులకు బెంగళూరుకు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ దగ్గర సంస్థ బస్టాండ్ ఐటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాంపస్ సెలక్షన్ నిర్వహించింది. సంస్థ హెచ్ఆర్ మేనేజర్ గీతం దేశాయి సీనియర్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రశాంత్ జ్యోసి పాల్గొని విద్యార్థులకు నాలుగు వివిధ ప్రక్రియలను నిర్వహించారు. ఆంగ్లభాష ప్రతిభను పరిరక్షించుటకు మొదటి రాత పరీక్షను తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్ టెక్నికల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూలను కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నియామక ప్రక్రియలు భాగంగా నిర్వహించిన పరీక్షల ఆధారంగా కళాశాలకు చెందిన 30 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. విద్యార్థులు ఏడాది ఆగస్టున సంస్థ నందు రిపోర్ట్ చేయవలసి ఉండగా వారికి వార్షిక వేదనంగా 9 లక్షల ప్యాకేజీని సంస్థ అందించాలని ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ భరత్ కృష్ణ మాట్లాడుతూ మా కళాశాలలో విద్యార్థులు చేరిన మొదటి రోజు నుండి అనేక రంగాల్లో వ్యక్తిగత వృత్తి గత నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు అనేక వర్షాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ టి.ఆవని, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్వి సుబ్బారావు, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇమ్మడి క్రాంతికుమార్, వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.