Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్ధరాత్రి ట్రాక్టర్లతో ఇసుక తోలకాలు
- సుదూర ప్రాంతాలకు తరలింపు
- గోదారి తీరాన ప్రజలకు ఇసుక కరువు
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు మండలంలోని గోదారి తీరంలో కొందరు అక్రమార్కులు యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇసుక క్వారీల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల మణుగూరులోని ఇసుక ట్రాక్టర్స్ ఎటువంటి అనుమతులు లేకుండా ఇస్తారాజ్యంగా అక్రమంగా ఇసుక తోలకాలు చేపడుతున్నారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని రాయిగూడెం గ్రామ సమీపంలోని అక్రమంగా ఏర్పాటు చేసుకున్న క్వారీలో నుంచి కొందరు అక్రమార్కులు ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేయడం జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి వేళలు డాక్టర్ల ద్వారా చేపడుతున్నారని, అటువంటి సమయంలో వారికి ఎవరు అడ్డొచ్చిన ఏం చేయడాకైనా సిద్ధంగా ఉన్నారని స్థానిక ప్రజల ఆరోపిస్తున్నారు. అవసరాలను ఆసరా చేసుకుని వారి ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తున్నారని, గోదావరి తీరంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ఇక్కడ ఇసుక కరువవుతుందని మండిపడుతున్నారు. మణుగూరు గోదావరి ఇసుక క్వారీల నుంచి హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు ఇసుక రవాణా అవుతున్నప్పటికీ ఇక్కడ నిర్మాణాలు చేసుకునే వారికి మాత్రం ఇసుక కరువనట్లు టాక్టర్ యజమానులు చేస్తున్నారు. వారు చెప్పిన ధరలకు మాత్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఇసుక అక్రమంగా తీసుకొచ్చి నిర్వహించుకొని ఇతర ప్రాంతాలకు అక్రమంగా లారీల ద్వారా తరలిస్తున్నారు.
సెలవులు వస్తే చాలు....
మణుగూరులోని గోదావరి తీరం నుంచి అక్రమంగా ఇసుకతోలకాలపై రెవెన్యూ పోలీస్ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో అక్రమదారులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. రాత్రి, పగలు తేడా లేకుండా సెలవు దినాల్లో అక్రమ తోలకాలు జరుగుతున్నాయి. సెలవు రోజుల్లో అధికారులు ఎవరూ అందుబాటులో లేని సమయాల్లో అక్రమ దారులు ఇష్టానుసారంగా తోలకాలు చేపడుతుంటారు. ఈ విధంగా అక్రమ తూలకాలు చేపట్టడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇసుక సీనరేజీలు ఏర్పాటు చేయడం వల్ల సంబంధిత మున్సిపాలిటీలకు గాని పంచాయతీలో గాని కొంత ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అందరికీ మామూళ్లు
ప్రభుత్వానికి ఎటువంటి పనులు చెల్లించకుండానే గోదావరిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న అక్రమ వ్యాపారులు తాము అందరికీ మామూళ్లు ఇస్తున్నామంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ మాట చెప్పి అధిక ధరలకు ఇసుక అమ్మకాలు చేపడుతున్నారు. గతంలో స్థానికంగా కేవలం ఒక వెయ్యి నుంచి 1200 వరకు అమ్మకాలు చేస్తామని చెప్పినా టాక్టర్ యజమానులు ప్రస్తుతం రూ.1500 నుంచి 2000 వరకు అమ్ముతున్నారు. గోదావరిలో యంత్రాలు పెట్టి మరి తోలకాలు చేపడుతున్నారు. ఇదేమన ప్రశ్నిస్తే పోలీస్, రెవెన్యూ అధికారులకు నెలనెలా మామూలు అందిస్తున్నామంటూ బుకాయిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ విధమైన ఆక్రమ ఇసుక దందాకు తెరదించాలని, ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి.
మితిమీరుతున్న ఆగడాలు
ట్రాక్టర్ యజమానులు చేస్తున్న ఆగడాలు అంతా ఇంతా కాదు. రాత్రివేళ ఇష్టా నుసారంగా ట్రాక్ట ర్లను గ్రామాల మీద నుంచి పోతున్నాయి. దీంతో గ్రామంలో రోడ్లు పూర్తిగా పాడై పోతున్నా యి. కమలాపురంలోని ప్రధాన రహదారి పూర్తిగా ఇసుక ట్రాక్టర్ల వల్లనే పాడైపోతుంది. ప్రశ్నించే వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. అక్రమ వా ్యపారులకు అధికారులు అండదండలు పుష్కలంగా ఉండడంతో వారు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు.
- బొల్లం రాజు వ్యకాస మండల అధ్యక్షులు
అధిక ధరలకు అమ్ముతున్నారు
గోదావరి తీరం నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ ప్రజలకు అధిక ధరలకు అమ్ముతున్నారు. గోదావరి నుంచి అక్రమ రవాణా వల్ల ప్రభుత్వానికి ఆదాయం గండి పడుతుంది. ప్రజలపై భారం పడుతుంది. ఇసుక ధరలు అధికంగా ఉండటం వల్ల భవన నిర్మాణాలు సైతం తగ్గుతున్నాయి. దీంతో కార్మికులకు సైతం ఇబ్బందిగా మారుతుంది. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వెయ్యాలి.
- కోండ్రు గౌరీ, గిరిజన సంఘం మండల అధ్యక్షురాలు