Authorization
Fri April 25, 2025 05:09:42 pm
నవతెలంగాణ-టేకులపల్లి
హైదరాబాదులో బీఎస్పీ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ భరోసా సభకు టేకులపల్లి మండల బీఎస్పీ నాయకులు ఆదివారం బయలుదేరి వెళుతున్నట్లు ఇల్లందు నియోజక వర్గ బీఎస్పీ ఇన్చార్జ్ ప్రతాప్ తెలిపారు. సభలో రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలను పలువురు నాయకులు వివరిస్తారన్నారు. బీఎస్పీ అవినీతి లేని పాలన అందిస్తుందని, ప్రజలుఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాదావత్ ప్రతాప్, ఇల్లందు నియోజకవర్గ అధ్యక్షులు, మండల నాయకులు రాంబాబు, రాంప్రసాద్, తులసమ్మ, సుజాత, లావణ్య, లోకేష్, రాకేష్, తరుణ్, అరుణ్, కిరణ్ యశ్వంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.