Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలస్యంగా వచ్చి వెనుతిరిగిన అభ్యర్థులు
- వేడుకున్నా ఫలితంలేదు
- 1080 మందికి 19 మంది విద్యార్థులు గైర్హాజరు
నవతెలంగాణ-కొత్తగూడెం
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఏ), దేశ వ్యాప్తంగా మెడికల్ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షకు ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగాయి. జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. కొత్తగూడెంలోని సింగరేణి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలల, పాల్వంచలోని డిఏవి పాఠశాలలో పరీక్షలు పటిష్టంగా ఏర్పాటు చేసినట్లు నీట్ సిటీ కో-ఆర్డినేటర్ ఎంవి. శ్రీనివాసరెడ్డి తెలిపారు.
దేశ వ్యాప్తంగా 20 లక్షలు మంది విద్యార్థులు సిద్ధం కాగా భద్రాద్రి జిల్లాలో రెండు కేంద్రాలలో 1080 మంది విద్యార్థులుకు గాను 19 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షల నియమ నిబం ధనలుకు అనుగుణంగా రెండు కేంద్రాలలో సరైన సమయంకి ప్రారంభం అయి నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరిక్ష భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని పాల్వంచ డిఏవి స్కూల్, కొత్తగూ డెంలోని సింగరేణి డిగ్రీ, పీజి కాలేజ్‌లో ప్రశాంతంగా జరిగాయి. నీట్ పరీక్షకు మొత్తం విద్యార్థులు 1080 మంది రాశారు. కొత్తగూడెంలోని సింగరేణి మహిళా డిగ్రీ పీజీ కళాశాలలో 480 మందికి 11 మంది గైర్హాజరుకాగా, 479 మంది విద్యా ర్థులు హాజరయ్యారు. పాల్వంచలోని కేటిపిఎస్ డిఏవి పాఠశాలలోని పరీక్షా కేంద్రంలో 600 మంది విద్యార్థులు 582 మది హాజరయ్యారు. 8 మంది గైర్హాజరు అయ్యారు. మొత్తంగా 19 మంది విద్యార్థులు హాజరు కాలేకపోయారని తెలిపారు.
ఆలస్యంగా వచ్చి వెక్కిఏడ్చిన విద్యార్ధిని
నీట్ పరీక్షలకు 1080 మంది హాజరుకావాల్సి ఉండగా వివిధ కారణాల రిత్యా కొంత మంది అభ్యర్థులు హాజరు కాలేక పోయారు. కొంత మంది అభ్యర్థులు సమయం దాటిన తరువాత పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన తీరు కనిపించింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి విద్యార్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతిచారు. జాతీయ స్థాయి పరీక్ష కావడంతో నిబంధనలు కఠినంగా ఉన్నాయి. పరీక్ష రాసే విద్యార్ధినులు వారు ధరించిన నగలను తీయించి, లోనికి అనుమతించారు. ఆలస్యంగా వచ్చిన వారు పరీక్ష రాయకుండా వెనుతిరిగారు. కొత్తగూడెం సింగరేణి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల పరీక్ష కేంద్రం గేటువద్ద పాల్వంచకు చెందిన ఇద్దరు ఆలస్యంగా వచ్చి, అనుమతిలేక కళ్లనీళ్లు పెట్టుకున్నారు. బందో బస్తులో అక్కడే ఉన్న కొత్తగూడెం 1టౌన్ సిఐ కరుణాకర్‌ను కన్నీళ్ల పర్యంతంతో వేడుకున్నారు. ఆయన పరీక్ష నిర్వహకులను కలిసి విన్నవించినప్పటికీ పరీక్ష నిబంధన ప్రకారం అనుమతి లేదని తేల్చి చెప్పారు.