Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఏజీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిడియం బాబురావు
నవతెలంగాణ భద్రాచలం రూరల్
అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఉద్యమించాలని మాజీ ఎంపీ, టీఏజీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మీడియం బాబురావు అన్నారు. భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ఉన్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మీడియం బాబురావు, ఘంటం దొర విగ్రహానికి టీఏజీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కారం పుల్లయ్య, మల్లు దొర విగ్రహానికి ప్రముఖ న్యాయవాది పాయం రవివర్మ పూలమాల వేసి నివాళులర్పించారు. సభ అధ్యక్షులు భద్రాచలం పట్టణ అధ్యక్షులు సోయం జోగారావు అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో మీడియం బాబురావు మాట్లాడుతూ మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్వతంత్ర సమరయోధుడు ఆనాటి బ్రిటిష్ పాలకులను తెల్లదొరలను తరిమి కొట్టిన బ్రిటిష్ వాళ్ళ గుండెల్లోకి దూసుకొని వెళ్ళిన విప్లవ బాణం అల్లూరి సీతారామరాజు అని వారి స్ఫూర్తితో భవిష్యత్తు పోరాటాలకు ఆదివాసీలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని స్వతంత్ర పోరాటంలోనే కాదు ఆదివాసీ హక్కుల కోసం కూడా అనేక పోరాటాలు చేసిన మహా వీరుడు అన్నారు. ఆ యోధుడుని 1924 మే 7వ తారీఖున అతి దారుణంగా బ్రిటిష్ సామ్రాజవాదులు చెట్టుకు కట్టేసి తుపాకులతో కాల్చి చంపడం జరిగిందని ఆయన ఉద్యమం 1922 నుండి 1924 మే 7 వరకు కొనసాగిందని రెండు సంవత్సరాల కాలంలోనే అనేక ఆదివాసి హక్కులు సాధించడం ఈ దేశం నుండి తెల్లదొరలను తరిమికొట్టే విధంగా ఉద్యమించడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈనాటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ 2014లో అధికారంలో వచ్చిన తర్వాత నుండి ఇప్పటివరకు ఆదివాసీల పైన ఆదివాసి హక్కుల పైన దాడి చేయడం కాకుండా అడవులన్నీ కార్పొరేట్ శక్తులకు అమ్మేసే ప్రయత్నం చేస్తుందని ఇట్లాంటి ప్రయత్నాలు మానుకోకపోతే రానున్న కాలంలో బిజెపి పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదింపడానికైనా ఆదివాసీలందరిని ఐక్య పోరాటాలతో ఐక్యం చేసి ఉద్యమిస్తామని హెచ్చరిక చేశారు.
అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిధిలో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఉద్యోగా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2020 ఏప్రిల్ 22న రద్దు చేసిన జీవో నెంబర్ త్రీని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కలిసి చట్టం చేయడం కోసం రూపకల్పన చేయాలని ఆయన అన్నారు. తరతరాలుగా సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కారం పుల్లయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు సున్నం గంగా, ప్రముఖ న్యాయవాది ఆదివాసి నాయకుడు పాయం రవివర్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గడ్డం స్వామి పిఏజిఎస్ టౌన్ కార్యదర్శి కుంజా శ్రీను, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సండ్ర భూపేందర్, సీఐటీయూ నాయకులు నకరికంటి నాగరాజు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.