Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తేమ సాకుగా చూపి రైతులకు నష్టం చేయొద్దు
- రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యాల విశ్వనాథం
- ప్రభాత నగర్(రెడ్డిగూడెం) ధాన్యం
కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సీపీఐ బృందం
నవతెలంగాణ-పాల్వంచ
సీసీఐ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే కాటాలు పెట్టాలని, ఇటీవల కురిసిన అకాల వర్షాలతో కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి నష్టపోయిన సమస్త రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యాల విశ్వనాథం డిమాండ్ చేశారు. పాల్వంచ మండలం ప్రభాత నగర్(రెడ్డిగూడెం) ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, సీపీఐ బృందం ఆదివారం సందర్శించారు. రైతులను కలుసుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, ఐతే క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని, దాన్యాన్ని ఆరబెట్టుకొని రావాలని సంబందిత అధికారులు నిబంధన విధిస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారని, తరచూ వర్షాలు కురుస్తుండటంతో దాన్యాన్ని ఆరబెట్టే పరిస్థితులు లేకుండా పోయాయన్నారు. 17శాతం తేమ అనే నిబందన వల్ల రైతాంగం నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
లక్షలాది ఎకరాల్లో పండించిన వరిదాన్యం అకాల వర్షాలకు తడిసి ఇంకా కళ్లాలోనే ఉందని, రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్న ఈ దాన్యాన్ని 17 శాతం నిబందను విధించకుండా కొనుగోలు చేయాలని కోరారు. అకాల వర్షాలకు వరితోపాట మొక్కజొన్న, మిర్చి, మామిడి రైతులు సైతం పూర్తిగా నష్టపోయారన్నారు. రైతులకు జరిగిన నష్టంపై కేంద్రం ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉందని, ఎకరాకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే పరిహారంతో నిమిత్తం లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి పరిహారం అందించాలని కోరారు. సాగుకోసం అప్పులు చేసి పెట్టిన పెట్టుబడులు తీర్చే స్థితిలో లేక, మళ్ళి అప్పులు చేసే దైర్యం లేక రైతన్నలు గుండెనిబ్బరం కోల్పోతున్నారన్నారు. ప్రభుత్వం నుంచి రైతులకు ఖచ్చితమైన హామీ ఇచ్చి నష్టపోయిన రైతుల కన్నీళ్ళు కన్నీళ్ళు తుడవాలని, సుమారు 100మంది రైతుల ధాన్యం సీసీఐ కేంద్రంలో ఉందిని యుద్ధ ప్రాతిపదికన సీసీఐ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే కాటాలు పెట్టాలినీ, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జరిగిన నష్టంపై సర్వేలు చేపట్టి త్వరితగతిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రతినిధి బృందంలో సిపిఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోటి నాగేశ్వరరావు, రైతు సంఘం.మండల కార్యదర్శి రామచందర్, ఉపేందర్ రెడ్డి, గుడాపురి రాజు, జకరయ్య, రైతులు నిమ్మల మోహన్ రెడ్డి, జక్కుల కృష్ణ, రాములు, వెంకట్ రెడ్డి, వేల్పుల లింగయ్య, సత్తిరెడ్డి, మహేందర్ రెడ్డిలి ఉన్నారు.