Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ పాలనలో బతుకులు దారుణం
- రూ.8లక్షల కోట్ల విశాఖ స్టీల్ ప్లాంట్ రూ.32 వేల కోట్లకు కట్టబెట్టే ప్రయత్నం
- మేడే స్ఫూర్తితో యువ కార్మికులు హక్కులు కాపాడుకోవాలి
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నర్సింహారావు
నవతెలంగాణ-ఇల్లందు
కేంద్రంలోని బీజేపీ పాలనలో కార్మికుల బతుకులు దారుణంగా ఉన్నాయని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నర్సింహారావు విమర్శించారు. మతం పేరుతో కార్మికుల మధ్య చిచ్చులు పెడుతున్నారని అన్నారు. హిందూ, ముస్లీం, క్రిస్టియన్ అంటూ నూరిపోసి విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకునే పరిస్థితులు మోడిప్రభుత్వం తెస్తోందని కార్మికులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్మికులకు ఉపయోగపడే చట్టాలను రద్దు చేసి ఇంటికి పంపే చట్టాలను ప్రవేశ పెడుతోందని అన్నారు. రానున్న కాలంలో పరిస్థితులు దారు ణంగా ఉండబోతున్నాయని అన్నారు. స్దానిక జెకె ఓసి మైన్పై ఆదివారం ఫిట్ మీటింగ్ జరిగింది. ఈ సందర్బంగా జరిగిన సభలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. సంద పదను సృష్టించేది కార్మికులు, ప్రజలు. కానీ మోడీ ఎర్రకోట సాక్షిగా సంపద సృష్టికర్తలు పెట్టుబడిదారులని అన్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం 44 చట్టాలను సమూ లంగా మార్చివేసిందన్నారు. బొగ్గుగనుల్లో 12గంటలు పని చేయాలని చట్ట సవరణ చేసిందన్నారు. కార్మికులు సమ్మెలు చేయాల్సి వస్తే 14 రోజుల ముందు యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చి చేసేవారని దీనిని 60 రోజులకు పొడి గించారని అన్నారు. పరిశ్రమలో ఏడుగురు కార్మికులుంటే సంఘం పెట్టుకునే అవకాశం ఉందని దీనిని సైతం 300 కార్మికులు ఉండాలని మెలికలు పెడుతోందన్నారు. ఈ రోజుల్లో ఒక్కొక్క వస్తువు ఒక పరిశ్రమలో తయారౌతున్నా యన్నారు. ఈ విధంగా దేశంలో 5లక్షల చిన్న పరిశ్రమలున్నాయన్నారు. కూలి పనుల్లాగా హైర్అండ్ ఫైన్ పని చేయించుకుని ఇంటికి పంపే ఏర్పాటు చేస్తోందన్నారు.
ఫిక్స్డ్ టైం ఎంప్లాయిమెంట్ పేరుతో ఇక ఇంటికే
దేశంలో పరిశ్రమలు పెట్టాలని ప్రధాని మోడీ అమెరికాను కోరగా మీ దేశంలో కార్మిక చట్టాలు బాగా పనిచేస్తున్నాయని పరిశ్రమలు స్దాపించలేమని చెప్పారని అన్నారు. దీంతో అనుకూలమైన కార్మిక చట్టాలు తెస్తామని మోడీ హామి ఇచ్చారని అన్నారు. దీని మూలంగానే పరిశమ్రలు, బొగ్గుగనుల్లో ఇక నుండి ఫిక్స్డ్ టైం ఎంప్లాయిమెంట్ పేరుతో పనిచేయించుకుని ఇంటికి పంపే ఏర్పాటు చేస్తోందని అన్నారు. పని చేసే స్ధలాల్లో పర్మినెంట్ కార్మికులతో సమానంగా అప్రంటిస్ కార్మికులు ఉచితంగా పనిచేసే విధాలు ఆమలు చేయాలని బిజేపి ప్రభుత్వం చట్టంలో అనేక మార్పులు చేస్తోందన్నారు.
రూ.8లక్షల కోట్ల విశాఖ స్టీల్ ప్లాంట్ రూ.32 వేల కోట్లకు కట్టబెట్టే ప్రయత్నం
దశాబ్దాల నుండి వేలాది మంది కార్మికులతో లాభాలబాటలో నడుస్తోన్న విశాఖ ఉక్కు స్టీల్ ప్యాక్టరీని ప్రధాని మోడీ ప్రభుత్వం కారు చౌకగా అమ్మెస్తోందన్నారు. రూ.8లక్షల కోట్ల విశాఖ స్టీల్ ప్లాంట్ రూ.32 వేల కోట్లకు కట్టబెట్టే ఏర్పాట్లు జరిగాయన్నారు. నీటి అయోగ్ మినిస్ట్రీ ప్రకారం ఒకరికి రెండు పరిశ్రమలు ఇవ్వాలని కాని దీనికి విర్దుంగా ఆదానికి 6 ఎయిర్ పోర్టులు ఇచ్చారని అన్నారు. ఆదాని ఆస్తులు 50వేల కోట్లు ఉండగా ప్రధాని మోడీ హయాంలో నేడు రూ.18లక్షల కోట్లు అయ్యాయన్నారు. ఆదాని కంపినీల డొల్లతనం అమెరికాకు చెందిన బర్గ్ బట్టబయలు చేశారని దీంతో రూ.10లక్షల కోట్ల సంపద ఆవిరయ్యాయన్నారు. షేర్ మార్కెట్ కుప్పకూలిందన్నారు. దేశ సందపద ప్రయివేటకు ప్రజలకు భారాలు మిగిలాయాన్నారు.
బొగ్గుగనుల నిర్వీర్యానికి కేంద్రం,రాష్ట్రం ఎత్తులు : పూసపల్లి ఓసి సింగరేణి చేపట్టాలి
బొగ్గుగనుల నిర్వీర్యానికి కేంద్రం ఎత్తులు వేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అదే దారిలో వెల్లడం సరికాదన్నారు. మార్చి 2015లో మోడి ప్రభుత్వం బొగ్గుగనులు ప్రయివేటుకు అమ్మడం చట్టం చేశారని అన్నారు. ఆస్ట్రేలియాలో బొగ్గు బ్లాక్ ఆదానికి ప్రధాని మోడీ ఇప్పించి దేశంలోకి బొగ్గు దిగుమతి చేస్తున్నారని అన్నారు. సింగరేణి బొగ్గు టన్నుకు రూ.4వేలు ఉండగా ఆదాని బోగ్గు టన్నుకు రూ.32వేలు కొనాలని మెలికలు పెడుతున్నారని అన్నారు. అనేక రాయితీ చట్టాలు రద్దు చేశారని అన్నారు. కోయగూడెం ఓసి-3 అరబిందో కంపిని ఒక్కరే వేశారని నిబంధనల ప్రకారం ఇవ్వకూడదని కాని యాజమాన్యం కట్టబెట్టిందన్నారు. ఈ విధంగా సింగరేణిలో ఒకటి, కోల్ ఇండియాలో మొత్తం 160 బొగ్గు బ్లాకులను ప్రయవేటకు ఇచ్చారని అన్నారు. ఇల్లందులో 21 ఇంక్లైన్, పూసపల్లి భూగర్భగనుల నుండి ఓసి ఎక్స్టెంషన్ పేరుతో ఓసి సిద్దమైందని దీనిని ప్రయివేటకు అప్పజెప్పడానికి సింగరేణి యాజమాన్యం పూనుకుందని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. సిఎం కేసిఆర్ చొరవ చూపి సింగరేణి సంస్ధ ఓసి నడిపే విధంగా చూడాలని కోరారు.
మేడే స్ఫూర్తితో యువ కార్మికులు హక్కులు కాపాడుకోవాలి
ఎన్నో పోరాటాలు ప్రాణత్యాగం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలు రద్దు చేసి కార్మికులకు ఉపయోగంలేని చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెస్తోంది. మేడే స్ఫూర్తితో కొత్తగా వస్తున్న యువ కార్మికులు హక్కులు కాపాడుకోవాలని మందా నర్సింహారావు కోరారు. ఆలిండియా పిలుపులో భాగంగా మే ఒకటి నుండి 8 మేడే వారోత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఈ సభలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు కూకట్ల శంకర్, జిల్లా నాయకులు నబి, బ్రాంచి కార్యదర్శి ఎండి. అబ్బాస్, మండల కార్యదర్శి తాళ్ళూరి కృష్ణ, మన్యం మోహన్రావు, రమేష్, చందర్, రాంభరోస్, సదానందం పాల్గొన్నారు.