Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
ఐకేపీ వీఓవోఎల హక్కుల పోరాటానికి టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బానోతు రాము సంఘీభావం తెలిపారు. ఆదివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు చేస్తున్న శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. వారి న్యాయమైన కోర్కెల సాధనకు మధతు తెలియచేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బానోతు రాము, మండల అధ్యక్షులు షేక్ మీరా హుస్సేన్ మాట్లాడుతూ... విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్స్ న్యాయమైన డిమాండ్స్‌ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కనీస వేతనం, సెర్చ్ ఉద్యోగుల వలె గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా వీఓఏలు తమకు మద్దతు తెలిపిన యూటీఎఫ్ సంఘానికి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు కుమారస్వామి, రత్న ప్రసాద్, డీఓఏల మండల అధ్యక్ష కార్యదర్శులు కనితి సులోచన, శ్రీను, గోపాల్, రామ నర్సయ్య, షేక్ జరీనా, బేగం లలిత, పద్మ, వెంకటలక్ష్మి, సీత, అరుణ, హ్యాండ్ రైటింగ్ హుస్సేన్ పాల్గొన్నారు.