Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఆర్టీడబ్ల్యూఏఎఫ్ జిల్లా కార్యదర్శి జిల్లా ఉపేందర్
ఖమ్మం : ట్రాన్స్‌ఫోర్ట్ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐఆర్టీడబ్ల్యూఏఎఫ్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి జిల్లా ఉపేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మంలోని సుందరయ్య భవన్లో జిల్లా కమిటీ సమావేశం రాందాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో రవాణా రంగంలో అత్యంత ఎక్కువ కార్మికులు ఉన్నారన్నారు. ట్రాన్స్‌ఫోర్టు ఉన్న కార్మికులు డ్రైవర్లు, హెల్పర్లు, షోరూం వర్కర్లుగా అలాగే రవాణా రంగం బాగా విస్తరిస్తుందని, దానిలో ఉన్న కార్మికులు అందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు అడ్డాలు ఏర్పాటు చేయాలని, జెసిబి, స్కూల్ బస్ డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, ఎయిర్‌బస్ డ్రైవర్స్, లారీ, కారు డ్రైవర్లు మొదలు స్కిల్ డ్రైవర్స్ అందరికీ ప్రభుత్వం విడుదల చేసిన 18500 రూపాయలు నుండి 33500 రూపాయలు జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రమాదం జరిగితే ఆ సంస్థలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని, వారికి ఆ సమయంలో ప్రమాద ఖర్చులు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో జెసిబి డ్రైవర్ ప్రెసిడెంట్ వెంకట్, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు అమరయ్య, ట్రాక్టర్ యూనియన్ నాయకులు రామ్మూర్తి, ఆటో యూనియన్ జిల్లా కోశాధికారి దండగల ఉపేందర్, నాయకులు అక్బర్ ,కాసిం, నరసయ్య నాగేశ్వరావు, ఖలీల్, శీను పాల్గొన్నారు.