Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్
నవతెలంగాణ-ఖమ్మం
ఈ నెల 26, 27, 28వ తేదీల్లో హైదరాబాద్లో డీవైఎఫ్ఐ జాతీయ కమిటీ సమావేశాలు జరగబోతు న్నాయని, ఈ సమావేశాలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మంలోని సుందరయ్య భవనంలో జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ అధ్యక్షతన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ కమిటీ సమావేశాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం నేషనల్ సెమినార్ను హైదరాబాద్ ఎస్వీకే లో ఈనెల 26వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నేషనల్ సెమినార్కు రాష్ట్రం మొత్తం వివిధ జిల్లాల నుంచి వెయ్యి మందికి పైగా హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సెమినార్కు డీవైఎఫ్ఐ ఆల్ ఇండియా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఎంఏ రహీం హాజరవుతారని, జాతీయ కమిటీ సమావేశాల్లో దేశవ్యాప్తంగా 500 మంది పాల్గొంటారని ఆయన తెలిపారు. బిజెపి అనుసరిస్తున్న విధానాల పైన చర్చించి, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కార్యక్రమాలు రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్, శీలం వీరబాబు, జిల్లా నాయకులు కొంగర నవీన్, కనపర్తి గిరి, కూరపాటి శ్రీను పాల్గొన్నారు.