Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమస్యలను పరిష్కరించాలని గత పది రోజులుగా ముదిగొండ మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న విషయం విధితమే. సమ్మెలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు ఆదివారం వంటావార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్ష కార్యదర్శి ఎస్కే యాకూబ్ పాషా, మహమ్మద్ సాహెబ్ ఆలీ కోశాధికారి ఓబినబోయిన రాంబాబు, కార్యదర్శులు ఎం భాగ్యలక్ష్మి,జి రాంబాబు,కె నరేష్,వి నాగమణి, బి హరీష్, సిహెచ్ వీరభద్రం, వి స్వర్ణలత, రామకృష్ణ, కొండ నరేష్, వై మల్లికార్జున్, ఎన్ వెంకటేష్, ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.