Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న బీపీ, షుగర్ మెగా క్యాంప్ అభినందనీయమైనదని మేఘ శ్రీ హాస్పిటల్స్ ప్రముఖ వైద్యులు టి.పవన్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలో బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో మేఘ శ్రీ హాస్పటల్ నందు ఆదివారం అమరజీవి తూము ప్రకాష్ రావు జ్ఞాపకార్థం నిర్వహించిన బిపీ, షుగర్ మెగా క్యాంప్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత జీవనశైలిలో బిపీ, షుగర్, గుండె వ్యాధులు సర్వసాధరణమైనాయని, పేషంట్లకు రూ.100 కే నెలకు సరిపడ మందులు అందజేయడం గొప్ప విషయమన్నారు. బీపీ, షుగర్ ఉన్నవారు క్యాంప్ సేవలు సద్వినియోగించు కోవాలని తెలిపారు. ట్రస్ట్ సేవలను అన్ని గ్రామాలకు విస్తరిస్తున్నట్లు ఆయన తెలిపారు. బత్తినేని చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల ఆఖరులో జానకిపురం ఉన్నత పాఠశాలలో న్యూరో, ఆర్థో, డెంటల్, గైనిక్, జనరల్ మెగా హెల్త్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నామని, మండల ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. అనంతరం రోగులకు నిర్వాహకులు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు, ట్రస్ట్ సభ్యులు తూము రోషన్ కుమార్, ఆర్ఎంపీడబ్లూఏ టీఎస్ జిల్లా అధ్యక్షులు బొమ్మినేని కొండలరావు, సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, సిపిఐ సీనియర్ నాయకులు జక్కా నాగభూషణం, ఏలూరి పూర్ణచందు, తోటపల్లి ఆనంద్ రావు, క్యాంపు నిర్వాహకులు ఆకెన పవన్, సాధనపల్లి ఆమర్ నాథ్ తదితరులు పాల్గొన్నారు.