Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధనియాకుల హనుమంతరావు
నవతెలంగాణ-కామేపల్లి
నేడు కామేపల్లి మండలానికి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు విచ్చేయుచున్న మంత్రి అజరు కుమార్, ఎమ్మెల్యే హరిప్రియ పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల హనుమంతరావు కోరారు. మండలంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మంత్రి ఎమ్మెల్యే పర్యటనలు పండితాపురం గ్రామం నుండి భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీగా మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నరసింహారావు, కోట మైసమ్మ, ఆలయ కమిటీ చైర్మన్ మల్లంపాటి శ్రీనివాసరావు, వడియాల.క్రిష్ణారెడ్డి, తూము.బాబు తదితరులు పాల్గొన్నారు.