Authorization
Thu April 24, 2025 10:35:53 am
నవతెలంగాణ-ఖమ్మం
నగరంలోని వివిధ హాస్పిటల్స్‌లో అనారోగ్యానికి గురి అయి చికిత్స పొందుతున్న సిపిఎం పార్టీ జిల్లా నాయకులు టి.కృష్ణ, ప్రమాదంలో కాలుకు ఫ్రాక్చర్ అయినా పార్టీ వైరా టౌన్ కార్యదర్శి సుధాకర్‌ను పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, నవీన్ రెడ్డి, కాంపాటి వెంకన్న పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను కలిసి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. వారికి వైద్యం చేస్తున్న డాక్టర్లను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారు వెంటనే కోలుకోవాలని, ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలని వారు ఆకాంక్షించారు.