Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
నిరుపేద ఇంట పుట్టిన పిల్లి అఖిల్ నార్త్ ఈస్ట్ షైల్లింగ్ పోటీలలో షిల్లాంగ్లో జరిగిన జాతీయ పోటీలలో ప్రథమ బహుమతి, గోల్డ్ మెడల్ సాధించాడు. ఆదివారం స్వగ్రామం వైరా మండలం కొస్టాల గ్రామం వచ్చిన సందర్భంగా తాటిపూడి, కోస్టాల గ్రామ సర్పంచ్ లు భట్టా భద్రయ్య, మంచాల జయరావు ఆధ్వర్యంలో గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. తాటిపూడి నుండి కొస్టాల గ్రామానికి ప్రజలు ర్యాలీలో పూల వర్షం కురిపిస్తూ తీసుకెళ్లారు. పిల్లి శరత్ బాబు ప్రమీల కుమారుడు అఖిల్ జాతీయ స్థాయిలో విజేతగా నిలిచి జపాన్లో త్వరలో జరగనున్న పోటీలలో పాల్గొనేందుకు సోమవారం బయలుదేరనున్నాడు. కొస్టాల గ్రామంలో సర్పంచ్ మంచాల జయరావు ఆధ్వర్యంలో జరిగిన సన్మాన సభలో గ్రామస్థులు పూల మాలలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా పిల్లి అఖిల్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ పేదరికం తెలియకుండా పెంచిన తల్లి దండ్రుల ప్రోత్సాహంతో కష్టించానని అన్నారు. సర్పంచ్ జయరావు మాట్లాడుతూ కొస్టాల గ్రామం ఎక్కడ ఉంటుందో చాలా మందికి తెలుసో తెలియదు గాని పిల్లి అఖిల్ జాతీయ స్థాయిలో సాధించిన గోల్డ్ మెడల్ తో గొప్ప ఖ్యాతి గడించిన గ్రామంగా వెలుగొందనున్నదన్నారు. అందుకు గర్వపడుతున్నామని అఖిల్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఈవూరి లక్ష్మి, మద్దెల బాబురావు, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.