Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఓడబ్ల్యు రాష్ట్ర నేత బయ్య శారద
నవతెలంగాణ-ఇల్లందు
దేశానికి పథకాలు సాధించి ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ గౌరవాన్ని చాటిన రెజ్లర్లపై లైంగిక వేదింపులు మహిళా లోకానికి, దేశానికి అవమానకరమని పీఓడబ్ల్యు రాష్ట్ర నేత బయ్య శారద విమర్శించారు. కారకులైన బీజేపీ ఎంపీని కాపాడేందుకు ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం సిగ్గుచేటన్నారు. ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్లకు న్యాయం జరిగే వరకు వారికి తమ సంఘం అండగా ఉంటుందని ఆమె తెలిపారు. ఇల్లందులో సోమవారం సంఘం గౌరవాధ్యక్షులు నోముల కళావతి అధ్యక్షతన జరిగిన సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఆమె మాట్లాడారు. దేశరాజధానిలో జంతర్ మంతర్ వద్ద కొన్నివారాల నుండి కూర్చొని రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారని, మహిళా రెజ్లర్ల కన్నీటి గోడును ఈ దేశ, రాష్ట్ర మీడియా, పాలకుల పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు నోముల కళావతి, ఉపాధ్యక్షులు కల్తీ రాములమ్మ, కార్యదర్శి మోకాళ్ల సుగుణ, మల్లురి సుగుణ, వరలక్ష్మి, చింత లాలమ్మ, సర్పంచు భూక్యా బుజ్జి తదితరులు పాల్గొన్నారు.