Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
ఓసీ-2 పవర్ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, కార్మికులకు సరిపడా పేడేలు అందడంలేదని ప్లేడే సంఖ్యను పెంచాలని ఆ సెక్షన్ కార్మికులు, ఉద్యోగులు టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు వూకంటి ప్రభాకర్‌రావుకు సోమవారం విన్నవించారు. సోమవారం ఓసీ-2ను సందర్శించిన వూకంటికి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రక్షణ పేరుతో అధికారులు పలు కఠిన నిబంధనలు విధిస్తున్నారని ఆయన దృష్టికి తెచ్చారు. కార్మిక సమస్యలు తెలుసుకున్న ఆయన గని అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని చెప్పి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్ రవూఫ్, బ్రాంచి కార్యదర్శి కృష్ణ, నాయకులు శ్రీనివాస్, నగేష్, రామారావు, మదన్మోహన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.