Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొవ్వూరు రైల్వే లైన్ సాధన కమిటీ కన్వీనర్ కొదమసింహం పాండు రంగాచార్యులు
నవతెలంగాణ-కొత్తగూడెం
కోవిడ్-19 సమయంలో నిలిపి వేసిన రైళ్లు పునరుద్దరించాలని చేసిన అనేక పోరాట ఫలితంగా కొల్లాపూర్ ట్రైన్ భద్రాచలం రోడ్డుకు వచ్చిందని కొవ్వూరు రైల్వే లైన్ సాధన కమిటీ కన్వీనర్, సిటిజన్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కొదమసింహం పాండు రంగాచార్యులు తెలిపారు. సోమవారం కొల్హాపూర్ ఎక్స్ప్రెస్ భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం)కు వచ్చిన సందర్భంలో రైల్వే సిబ్బందికి, సహకరించిన రైల్వే అధికారులకు మిఠాయిలు పంచి రైల్వే ఏరియా అధికారి రంజిత్ కుమార్ మీనాని సన్మానించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్యాసింజర్లకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కొదమ సింహం పాండు రంగా చార్యులు రైల్వే అధికారులను అభినందిస్తూ భద్రాచలం రోడ్ నుండి డోర్నకల్ వరకు ఉన్న రైల్వే స్టేషన్లో గిరిజన ప్రయాణికుల సౌకర్యం కోసం తప్పనిసరిగా గతంలో నడిచిన డోర్నకల్ ప్యాసింజర్ ఉదయం పూట, సాయంకాలం కాజీపేట ప్యాసింజర్ తప్పనిసరిగా తిరిగి పునరుద్దరించాలన్నారు. ఈ ప్రాంతం పారిశ్రామిక, గిరిజన ప్రాంతమని తెలిపారు. భద్రాచలం రోడ్డు నుండి కరోనాకు ముందుగా ఇతర ప్రాంతాలకు నడిచిన అన్ని రైళ్ళను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరు కృష్ణ, సాయి, శంకర్, పవన్ కళ్యాణ్, శ్రీనివాస్, బాబూలాల్, రమణ, సంపత్, సుమన్, చైతన్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.