Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రౌండ్ టేబుల్ సమావేశంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న
- వివిధ ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాల నాయకుల విమర్శ
నవతెలంగాణ-కొత్తగూడెం
వీఓఏలు గత 22 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా వ్యవహరిస్తు చాలా మొండిగా ఉన్నదని, మొండి వైఖరిని విడనాడి వీఓఏల సమస్యల పరిష్కార దిశగా ఆలోచన చేయాలని, లేని పక్షంలో సమ్మె ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపులను అమలులో భాగంగా మంగళవారం నుండి సమ్మె ఉధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపు నిచ్చారు. ప్రత్యక్షంగా పరోక్షంగా విలువైన సమ్మెకు మా సహకారం ఉంటుందని వారు సంఘీభావం తెలియజేశారు. వీఓఏల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మెను ఉధృతం చేయాలనే దాంట్లో భాగంగా, స్థానిక బస్టాండ్ సెంటర్లో నిర్వహిస్తున్న సమ్మె దీక్షలు సోమవారం నాటికి 22వ రోజు దశల వారి నిరసన కార్యక్రమాల్లో భాగంగా అన్ని ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 9,10 తారీకులలో ఎమ్మెల్యే, ఎంపీలకు మెమోరాండం, 14వ తారీకు కుటుంబ సభ్యులతో ఆర్డిఓ కార్యాలయం ముట్టడి, 15వ తేదీన గ్రూపు సంఘాలతో పాటు అన్ని రోజులు ప్రజా సంఘాలతో కలెక్టరేట్ ముట్టడి ఉంటుందని రాష్ట్ర కమిటీ ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు పాల్గొని ప్రసంగించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, పట్నం జిల్లా కన్వీనర్ కొండపల్లి శ్రీధర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ భూక్య రమేష్, ఐఎన్టియూసీ జిల్లా నాయకులు కాలం నాగభూషణం, ఇఫ్య్టూ జిల్లా కార్యదర్శి ఎస్.సారంగపాణి, ఐఎఫ్యూ నాయకులు ఎల్.విశ్వనాథం, ఇఫ్య్టూ నాయకులు డి.ప్రసాద్, పి.సతీష్, ఎన్.సంజీవ్, గోపాలరావు, రమేష్, ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ నాయకులు రాంబాబు పాల్గొని తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వీఓఏలు రేష్మ, నిషా, మాధవి, స్వరూప, రాజమణి, పద్మ, అరుణ, కృష్ణకుమారి, వింధ్య, తదితరులు పాల్గొన్నారు.
కరకగూడెం : ప్రజ సంఘాల మద్దతుతో ఐకేపీ, వీవోఏల సమ్మె మరింత ఉధృతంగా నిర్వహిస్తామని సీఐటీయూ మండల నాయకులు కొమరం కాంతారావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సమ్మె శిబిరంలో ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఐకేపీ వెంకన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్న, సీఐటీయూ నాయకులు కొమరం కాంతారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం మండల అధ్యక్షులు ఇల్లందుల పిచ్చయ్య, మధ్యాహ్న భోజన కార్మిక రంగం నాయకురాలు పార్వతి, కొమరం అనసూర్య, లక్ష్మి, వెంకటమ్మ, గోపమ్మ, కొమరం లక్ష్మి, శాంత, సమ్మక్క, జగదాంబ తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : ఐకేపీలో పనిచేస్తున్న వీవోఏల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేనిచో ఉద్యమం ఉధృతం చేస్తామని ట్రేడ్ ఇండియన్ నాయకులు హెచ్చరించారు. సోమవారం సీఐటీయూ మండల కన్వీనర్ ఉప్పతల నరసింహారావు అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.లక్ష్మీనారాయణ, సింగరేణి కోల్ మైండ్స్ లేబర్ యూనియన్ ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు వెలగపల్లి జాన్, ఐఎఫ్టియూ జిల్లా ఉపాధ్యక్షులు మిడిదొడ్ల నాగేశ్వరరావు, సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వీరభద్రం, సీఐటీయూ నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వీఓఏల నాయకులు శ్రీను గోపాల్, సులోచన, రమేష్, రామ నర్సయ్య, మణెమ్మ, జరినా, హరిబాబు, అనురాధ, చాందిని, భారతి, వరలక్ష్మి, స్రవంతి పాల్గొన్నారు.