Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల విధులు అత్యంత ముఖ్యమైనవి అ గర్హజరైతే కఠిన చర్యలు
- తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పన చేయాలి
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-పాల్వంచ
అధికారులు సమయపాలన పాటించి నిబద్ధతతో పని చేయాలని ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సిబ్బంది బయోమెట్రిక్ హాజరు, సీఎం హామీలు, రెండో విడత గొర్రెల పంపిణీ, ఎన్నికల విధులు రీడింగ్ రూములు ఏర్పాటు తదితర అంశాలపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిటాల నిర్వహించి సిబ్బంది టూర్ డైరీ నివేదికలు అందజేయాలన్నారు. రెండవ విడత గొర్రెల పంపిణీకి ఎంపిక చేసిన లబ్ధిదారులు మూలధన వాటా చెల్లింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు మండల ప్రత్యేక అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 106 సొసైటీలోని 3,487 మందికి గొర్రెల పంపిణీ లక్ష్యం కాగా 3461 మంది లబ్ధిదారులకు విచారణ ప్రక్రియ పూర్తి చేశామని మిగిలిన 26 మంది లబ్ధిదారుల విచారణ ప్రక్రియ ఈనెల 10వ తేదీ వరకు పూర్తి చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఎంపిక చేసిన 3487 మంది లబ్ధిదారులు 1,570 మంది లబ్ధిదారులు ధ్రువీకరణ వివరాలు ఆన్లైన్ చేయడం జరిగిందని మిగిలిన 1,917 మంది లబ్ధిదారులు ఆన్లైన్ ప్రక్రియ ఈనెల 13వ తేదీ వరకు పూర్తి చేయాలని అన్నారు. చెల్లించారని 1,919 మంది చెల్లింపు వక్రీయం సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని తహసిల్దారులను ఆదేశించారు. తప్పులు లేని ఓటర్ జాబితా రూపకల్పనలో ఓటర్ నమోదు మార్పులు చెల్లింపులు తొలగింపు తదితర అంశాలపై ప్రతి వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని తాసిల్దారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీలు చేసిన సలహాలు సూచనలు సమావేశపు మినిట్స్ ప్రతులను కార్యాలయంలో భద్రపరచాలని చెప్పారు. గ్రామపంచాయతీలో రీడింగ్ రూములు ఏర్పాటుపై విద్యాశాఖ అధికారులు నివేదిక అందజేయాలని చెప్పారు. రీడింగ్ రూములు ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.