Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వ్యాప్తంగా లక్ష 10వేల మందికి చెల్లింపులు
- సుమారు రూ.75 కోట్లు చెల్లించేందుకు సన్నాహాలు
- 10న మంత్రి చేతుల మీదుగా పంపిణీకి ఏర్పాట్లు
- పోరాటల ఫలితంగ బోనస్ చెల్లింపులు : వ్యకాస
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నెండ్లుగా పెండింగ్లో ఉన్న తునికాకు బోనస్ చెల్లించేందుకు సిద్దమైంది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తునికాకు సేకరణ కార్మికులకు బోనస్ చెల్లించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. గత 8 ఏండ్లుగా నిలిచిపోయిన బోనన్ను చెల్లించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ నెల 10వ తేదీన తునికాకు సేకరించిన వారికి చెల్లింపులు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1లక్షా 10వేల 500 మందికి చెల్లింపులు చేయనున్నారు. ఈనెల 10వ తేదీ నుండి వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. జిల్లాలో సుమారు రూ.75 కోట్లు తునికాకు బోనస్ జమ చేసేందుకు అటవీశాఖ అధికారులు కార్యచరణ పూర్తి చేశారు. అడవి బిడ్డలకు వేసవిలో రెండో పంటగా తునికాకుసేకరణ ఎంతో ఆదాయాన్ని సమకూర్చి పెడుతుంది. గత 8 సంవత్సరాలుగా చెల్లించాల్సిన బోనస్ చెల్లింపుల్లో ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. ఎట్టకేలకు 2015 నుండి 2022 వరకు తునికాకు బోనస్ చెల్లించేందుకు చర్యలు తీసుకుంది. సుమారు 1,10,500 మంది లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో రూ.75 కోట్ల జమ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన గిరిజన ప్రాంతంలో వేసవి పంటగా తునికాకు సేకరణ జరుగుతుంది. ఆకు సేకరించిన కార్మికులకు ఆకు కొనుగోలుతో పాటు బోనస్ చెల్లిస్తుంది. గత ప్రభుత్వం 2014 వరకు బోనన్ చెల్లించారు. రాష్ట్ర ప్రభుత్వం 2015 నుంచి ఇప్పటివరకు బోనస్ చెల్లించలేదు. ముఖ్యంగా అడవి ప్రాంతంలో ప్రతి సంవత్సరం 20వేల మంది కార్మికులకు ఉపాధి పొందుతున్నారు.
జిల్లాలోని చర్ల, దుమ్ముగూడెం, పినపాక, మణుగూరు, ఇల్లందు, టేకులపల్లి, గుండాల, ఆళ్లపల్లి, ములకలపల్లి, రేగళ్ల, మైలారం తదితర ఏజన్సీ గ్రామంలో తునికకు సహకరణ భారీగా సాగుతుంది. ప్రభు త్వం తుకునికాకు అమ్మకాల్లో వచ్చిన లాభాల్లో కార్మికులకు బోన చెల్లించాల్సిసుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గత 8 సంవత్సరాల చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ నెల 10వ తేదీన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి చేతుల మీదుగా పినపాకలో తునికాకు బోనస్ చెల్లించేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇప్పటి వరకు బోనస్ చెల్లించాలి
అనేక పోరాటాల ఫలితంగా ప్రభుత్వం తునికాకు బోనస్ చెల్లించేందుకు ఏర్పాటు చేయడం సంతోషం కానీ, 2022 వరకు పెండింగ్లో ఉన్న బోనస్ చెల్లించాలి. తునికాకు సేకరణ కార్మికులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో చెల్లింపులు చేయాలని ప్రభుత్వం చేస్తున్నతీరు ప్రసంసనీయం. కానీ అందరికి బ్యాంకు ఖాతాలు లేవు. బ్యాంకు ఖాతాలు లేని వారికి నగదు చెల్లించాలి. తునికాకు కట్టకు రూ.5లు చెల్లించాలని, తునికాకుసేకరణ సమయంలో ఎలుగు బంటి దాడులు, పాము కాటుకు, వడదెబ్బకు గురై మృతి చెందిన కార్మికులకు ప్రమాద బీమా రూ.5లక్షలు చెల్లించాలి. ఎలాంటి అవకతవకలు లేకుండా అందరికి చెల్లించాలి.
- రేపాకుల శ్రీనివాస్, వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి