Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తులపై సత్వరం పరిష్కారానికి కలెక్టర్ చోరువ
నవతెలంగాణ-పాల్వంచ
కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు సమస్యలు విన్నపం దరఖాస్తులు ఇవ్వడానికి పోటెత్తారు. అయినప్పటికీ కలెక్టర్ అందరి సమస్యలు ఓపికగా వింటూ వాటి పరిష్కారానికి సత్వరం స్పందిస్తూ, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. మండల అధికారులతో వీడియో లింక్ ద్వారా మాట్లాడుతూ సమస్యల గురించి విని వాటి పరిష్కారానికి తగిన ఆదేశాలు ఇచ్చారు. ప్రజావాణి దరఖాస్తుల పట్ల అధికారులు తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ ప్రజావాణి దరఖాస్తు అనుసరించి పర్యవేక్షణ చారిని వీఆర్వో అశోక్ చక్రవర్తిని సూచించారు. ఈ ప్రజావాణిలో పలు మండలాల నుంచి ప్రజలు వచ్చే దరఖాస్తులు ఇలా ఉన్నాయి. అశ్వారావుపేట మండలంలో పెన్షన్ డబ్బులు ఇవ్వడం లేదని, బ్యాంకు అధికారులు రికవరీ చేస్తున్నారని బాధితుడు ఫిర్యాదు చేయడంతో లీడ్ బ్యాంకు మేనేజర్‌ను పిలిచి ఏ రూల్ ప్రకారం ఇలా పెన్షన్ డబ్బులు రికవరీ చేస్తున్నారని ప్రశ్నించారు. అశ్వారావుపేట ఎంపీడీఓను వీడియో కాన్ఫెరెన్సులో లైన్లోకి తీసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్యాంకు మేనేజర్‌కు నోటీసు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ముల్కలపల్లి మండలం, తిమ్మంపేట గ్రామంలో క్రీడా ప్రాణగం ఏర్పాటు చేయాలని కొండ్రు వంశీ వినరు దరఖాస్తు చేయగా వీడియో కాన్ఫెరెన్సు ద్వారా ఎంపీడీఓతో మాట్లాడి వారం రోజుల్లో క్రీడా ప్రాణగం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొక్కుబడిగా కాకుండా నాణ్యతతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టి పంపు గ్రామానికి చెందిన వి.వసంతరావు మరికొందరు గిరిజన రైతులు అన్నపురెడ్డిపల్లి మండలం అన్న దైవం రెవిన్యూలోని ప్రభుత్వ సీలింగ్ భూములను 30 సంవత్సరాల నుండి 81 మంది మీ సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని సాగు చేస్తున్న ప్రభుత్వ సీలింగ్ భూములకు అసైన్మెంట్ పట్టాలి ఇప్పించాలని పరిశీలించిన చర్యలకు తాసిల్దార్‌కు సిఫార్సు చేశారు. లక్ష్మీదేవి పెళ్లి మండలం సాటివారిగూడెం గ్రామపంచాయతీకి చెందిన కొప్పుల పద్మ తన భర్త మరణించారని తనకు ఒక పాప ఉన్నదని పదవ తరగతి వరకు చదువుకున్న తనకు ఉపాధి కల్పించాలని చేసిన దరఖాస్తులు పరిశీలించిన కలెక్టర్ ఉపాధి కల్పనా అధికారికి సిఫార్సు చేశారు.
ఇలా వివిధ మండలాల నుంచి సమస్యలకు తనదైన రీతిలో పరిష్కారం చూపుతూ ఒపీగా ప్రజా వాణిలో సమ స్యలు వింటున్న కలెక్టర్‌ను బాధితులు ప్రశంసి స్తున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటే శ్వర్లు, అన్ని జిల్లా ఉన్నదాఅధికారులు తదితరులు పాల్గొన్నారు.