Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులను పరిశీలించిన విప్ రేగా
నవతెలంగాణ-మణుగూరు
37 లక్షల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం మణుగూరు పట్టణంలోని బస్టాండ్ ఏరియా నందు సుమారు జరుగుతున్న సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులను మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించి, అక్కడ జరుగుతున్న పనుల వివరాలను పురోగతిని సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డ్రైనేజీ పనులు పూర్తయితే ఈ ప్రాంతాల్లో సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుంది అన్నారు. పనులను నాణ్యతతో వేగంగా చేయాలని సూచించారు. ప్రతి వార్డులోని అంతర్గత రోడ్లులు డ్రైనేజీలు వంటి నిర్మాణాలతో అభివృద్ధి పరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని ఆయన అన్నారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలను అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరుగిందన్నారు. పట్టణాన్ని మరింత సుంద్రీకరణ పట్టణంగా తీర్చిదిద్దుకొని భావితరాలకు అద్భుతమైన పట్టణాన్ని అందించడం సాధ్యమవుతుంది అన్నారు.