Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, డైలీ వేజ్ కార్మికులకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఐటీడీఏ ప్రజా దర్బార్ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ డీడీ రమాదేవికి తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ డైలీ వేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే.బ్రహ్మచారి హీరాలాల్ మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ వర్కర్లకు 20 నెలల వేతనాలు బకాయి ఉన్నాయని డైలీ వేజ్ వర్కర్లకు నాలుగు నెలల వేతనాలు బకాయి ఉన్నాయని ఈ బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాలు సకాలంలో రాక వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యలపై స్పందించిన డీడీ మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు నాలు గు ఐదు రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. డైలీ వేస్ వర్కర్ల వేతనాలకు సంబంధించి బడ్జెట్ అను మతి రాలేదని వచ్చిన వెంటనే వారి వేతనాలు చెల్లి స్తామని పేర్కొన్నారు. ఇతర సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ పీవో తోటి గిరిజన సంక్షేమ శాఖ అధికారులు దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ డైలీ వేజ్, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ నాయకులు సమ్మక్క, రామ, వీరభద్రం, యశోద, ముసలయ్య, నాగమణి, సత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు.