Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ భద్రాచలం రూరల్
భద్రాచలం పట్టణంలోని లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఎంసెట్ మోడల్ టెస్ట్‌కి విశేష స్పందన లభించింది. వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ మోడల్ టెస్ట్ హాజరైనారు. ఈ సందర్భంగా లిటిల్ ఫ్లవర్స్ కళాశాలల డైరెక్టర్ మాగంటి రమేష్ బాబు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జరగనున్న ఎంసెట్ పరీక్షకు ఈ మోడల్ టెస్ట్ ఎంత ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు. విద్యార్థినీ, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ మోడల్ టెస్ట్‌లో పాల్గొన్నారని తెలియజేశారు. భవిష్యత్తులో విద్యార్థినీ, విద్యార్థులు అవకాశం ఉన్న మేరకు పోటీ పరీక్షలలో పాల్గొనాలని ఆయన కోరారు. పరీక్ష ప్రారంభానికి ముందు లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ డైరెక్టర్ మాగంటి ప్రసాద్ బాబు చేతుల మీదుగా మోడల్ టెస్ట్ పేపర్లను ఆవిష్కరించి విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు బషీరుద్దీన్‌తో పాటు కళాశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.