Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన వీఓఏలు
నవతెలంగాణ భద్రాచలం రూరల్
వీఓఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని సోమవారం వారి సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం శ్రామిక మహిళా పట్టణ కన్వీనర్ మర్లపాటి రేణుక అధ్యక్షతన జరిగిన జరిగింది. ఈ సమావేశంలో సీఐటీయూ, కేవీపీఎస్, గిరిజన సంఘం నాయకులు ఎం.బి నర్సారెడ్డి, కోరాడ శ్రీనివాస్, కొంచెం శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఐకేపీ వీఓఏలుగా పనిచేస్తున్న వీరికి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం ఇవ్వటానికి ఎందుకు వెనకాడుతుందన్నారు. గత 2018లో ఎలక్షన్ల ముందు వీఓఏలకు రూ.7000 వేతనం ఇస్తామన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంకో ఆరు నెలల్లో ఎలక్షన్లు ఉన్నా కూడా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ టౌన్ నాయకులు నాగరాజు. కేవీపీఎస్ టౌన్ నాయకులు చేగొండి శ్రీనివాస్, పెయింటింగ్ వర్కర్ యూనియన్ అధ్యక్షులు జాకీర్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి కాపుల రవి, వీవోఏల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటలక్ష్మి, చంద్ర లీల, సహాయ కార్యదర్శి జానకి, కోశాధికారి సీతారత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ దీక్షలకు వందన, వీవో ఇందిరా, చామంతి జ్యోతి, ఆదర్శ బంతి ఎస్ హెచ్ సభ్యులు సంఘీభావంగా తెలియజేశారు.