Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొత్తం 167 మందికి ఇండ్ల పట్టాలు
- ఇండ్ల పట్టాలు అందజేసిన మంత్రి పువ్వాడ
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం నగరంలోని 2,3,4, 8వ డివిజన్లో 45 మందికి, 9వ డివిజన్లో 122 మందికి మొత్తం 167 మందికి ఇండ్ల పట్టాలు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 58, 59 ద్వారా ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు అక్కడే లబ్ధిదారులకు వారి పేరు మీదనే పట్టాలు ఇవ్వడం చారిత్రాత్మకమన్నారు. మీ పిల్లల భవిష్యత్ కోసం ప్రభుత్వం మీకు ఇస్తున్న అస్తి ఇది.. మీ ఇంట్లో మీరు నిర్భయంగా బ్రతకొచ్చు. మీ కల మీ కోరిక సీఎం కేసీఅర్ నెరవేర్చారు అని అన్నారు. ఖమ్మం నగరంలోనే నిర్మించిన 2500 మందికి ఈ పథకం ద్వారా పట్టాలు ఇవ్వగలిగామని పేర్కొన్నారు. సొంత స్థలం కలిగిన వారికి రూ.3 లక్షలు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం తరుపున అందిస్తామని అన్నారు. పేదల పట్ల ప్రభుత్వం ఎంతో చిత్తుశుద్దితో వ్యవహరిస్తున్నదని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, సుడా చ్కెర్మన్ బచ్చు విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దొరేపల్లి శ్వేత, ఆర్డిఓ రవీంద్రనాథ్, ఖమ్మం అర్బన్ తహసిల్దార్ శైలజ, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు జాన్భీ, దందా జ్యోతి రెడ్డి, నాయకులు ఇస్సాక్, భూక్య బాషా, నాగుల్ మీరా, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.