Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి అజయ్ కుమార్
- మండలంలో మంత్రి,ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన
- భారీ మోటార్ సైకిల్ ర్యాలీ
నవతెలంగాణ-కామేపల్లి
ప్రజల అవసరాల కోసం కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ .అజయ్ కుమార్, ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యూరాలు బానోత్. హరిప్రియ అన్నారు. కామేపల్లి మండలంలో కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలకు వారు విచ్చేశారు. వారికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున నిరాజనం పలికారు. అనంతరం భారీ మోటర్ సైకిల్ ర్యాలీతో మండలంలో సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మండలంలో 8 గ్రామాలలో 40 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు ప్రజల అవసరాల కోసం శంకుస్థాపనలు చేయడం జరిగిందన్నారు. కొత్త లింగాల కోట మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం పొందారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకు పోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రతి ఒక్కరూ పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఎంపీపీ బానోత్ సునీత రామదాస్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల హనుమంతరావు, జిల్లా నాయకులు ఒడియాల కృష్ణారెడ్డి, అంతోటి అచ్చయ్య, తీర్థాల చిదంబరావు, రాజు తదితరులు పాల్గొన్నారు.