Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ వైద్యులు కూరపాటి ప్రదీప్, ఏలూరి వెంకటేశ్వరరావు, చల్లగుండ్ల రాకేష్
నవతెలంగాణ - ఖమ్మం
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 5శాతం మంది ప్రజలను పట్టి పీడిస్తూ చాపకింద నీరులా గుట్టుచప్పుడు కాకుండా విస్తరిస్తున్న ప్రాణాంతక తలసేమియాను తరిమి కొడదామని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కూరపాటి ప్రదీప్‌కుమార్, డాక్టర్ ఏలూరి వెంకటేశ్వరరావు, డాక్టర్ చల్లగుండ్ల రాకేష్ పిలుపునిచ్చారు. తలసేమియా, సికిల్‌సెల్ సొసైటీ(టీఎస్సీఎస్) ఖమ్మం జిల్లా కన్వీనర్, కూరపాటి చిల్డ్రన్స్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కూరపాటి ప్రదీప్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం కేఎల్సీలో ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన సుమారు రెండు వందల మంది తలసేమియా బాధిత చిన్నారులను, చిన్నారుల పేరెంట్స్‌కు కొన్ని కీలకమైన అవగాహనతో కూడిన సూచనలు చేశారు. తొలుత ఖమ్మం జడ్పీ సెంటర్నుండి ర్యాలీగా ప్రారంభమై ఖమ్మం లేక్‌వ్యూ క్లబ్(కేఎల్సీ) వరకూ ర్యాలీ నిర్వహించారు. వైద్యులు ప్రజల్లో అవగాహన కల్పించారు. డాక్టర్ ఏలూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇంత మంది చిన్నారులకు అండగా నిలుస్తూ తలసేమియాకు వ్యతిరేకంగా ప్రదీప్‌కుమార్ చేపట్టిన మహా యజ్ఞానికి మనందరం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత మంది చిన్నారులకు కావాల్సిన రక్తం సేకరించే పనిలో మనం కూడా బాధ్యతగా రక్తదానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ఎక్కడా వెనకడుగు వేయకుండా బాలలను కాపాడుతున్న ప్రదీప్‌కుమార్ సేవలు చాలా విలువైనవని అన్నారు. ప్రధానంగా తలసేమియా అనేది నిత్యం కనీసం పదివేల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ దివ్య, వాలంటీర్లు సిరాజ్, రాజేష్, టిఎస్ సీఎస్ స్టాఫ్ అబిషేక్, మల్లేష్, నరేష్, సతీష్, సాయి, సుచరిత, నిర్మల తదితరులు పాల్గొన్నారు.