Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కటింగ్ లేకుండా కాంటా నిర్వహించాలి
- కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని త్వరగా తరలించాలి
- కలెక్టర్ వి.పి.గౌతమ్‌కు సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ-కూసుమంచి
అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం త్వరగా తరలించి, ధాన్యాన్ని కాంటాలో కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం, సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టర్ వి.పి గౌతమ్‌కు వినతిపత్రం అందజేశారు. మండలంలోని పాలేరు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ గౌతం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో సీపీఐ(ఎం) నాయకులు మాట్లాడుతూ అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రతి గింజ కొంటామని చెప్పేసి హామీ ఇచ్చిన ప్రభుత్వం కొనుగోలు చేయటంలో నిర్లక్ష్యం వహించిందని, దీని ఫలితంగా ధాన్యం మొత్తం తడిసి మొలకలు వచ్చాయన్నారు. కల్లెంలో ధాన్యం మొత్తం అలాగే ఉందని, ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడంలో విఫలం అయిందని, వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి కాంటాల్లో కటింగ్ లేకుండా, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మార్కెట్ తరలించాలని కలెక్టర్‌కు తెలంగాణ రైతు సంఘం, నాయకులు సిపిఎం నాయకులు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... కొనుగోలు చేసిన ధాన్యాన్ని మార్కెట్ తరలిస్తామని, అలాగే త్వరలోనే అన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ధాన్యం కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైస్ మిల్లు యాజమానులతో మాట్లాడి ధాన్యంలో కటింగ్ లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు తోటకూరి రాజు, బిక్కసాని గంగాధర్, మండల కమిటీ సభ్యులు పందిరి వీరారెడ్డి, రైతు సంఘం నాయకులు, సిపిఎం నాయకులు పాల్గొన్నారు.