Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు నివాళి
నవతెలంగాణ- నేలకొండపల్లి
నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన సీపీఐ(ఎం) సానుభూతిపరురాలు కోడూరి లక్ష్మి (65) ఆదివారం రాత్రి హైదరాబాదులో గుండెపోటుతో మృతి చెందారు. గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె పరిస్థితిని గమనించిన వైద్యులు మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాదు తరలించాలని సూచించడంతో హుటాహుటిన హైదరాబాద్ తీసుకెళ్లారు. వైద్య చికిత్సలు అందిస్తుండగా ఆమె పరిస్థితి విషమించి గుండెపోటుతో మృతి చెందారు. ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి బండి రమేష్‌లు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోడూరి లక్ష్మి కుటుంబం పార్టీ పట్ల అత్యంత విశ్వాసం, అంకితభావంతో పని చేస్తూ పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. ఆమె ఆకస్మిక మరణం పార్టీ అభివృద్ధికి తీరని లోటు అన్నారు. ఆమె భర్త కోడూరి వెంకటాచారి పార్టీ పట్టణ కార్యదర్శిగా మండల కమిటీ సభ్యునిగా క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి విశిష్ట సేవలు అందిస్తున్నారన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఆమె భౌతికకాయాన్ని సందర్శించిన వారిలో పార్టీ జిల్లా నాయకులు బండి పద్మ, గొడవర్తి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కె.వి.రామిరెడ్డి, ఏటుకూరి రామారావు, దుగ్గి వెంకటేశ్వర్లు, పగిడికత్తుల నాగేశ్వరరావు, భూక్య కృష్ణ, మందడపు మురళీకృష్ణ, కూరపాటి అప్పారావు, తెల్లమేకల శేషుబాబు, కొత్తూరు వెంకటాచారి, కూచిపూడి శ్రీదేవి తదితరులు ఉన్నారు.