Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఎర్రుపాలెం
సిపిఎం సభ్యులుగా కొనసాగుతూ పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి కడవరకు పార్టీలోనే కొనసాగారని, పార్టీ ఇచ్చిన పిలుపులలో పాల్గొని ఆయన చేసిన పోరాటాల ద్వారానే చిత్తారు రాజుకు ఘనమైన నివాళులని సిపిఎం మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య అన్నారు. మండల పరిధిలోని నరసింహపురం గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ సభ్యులు చిత్తారు రాజు గత సంవత్సరం మృతి చెందారు. సోమవారం ఆయన ప్రధమ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత సిపిఎం జెండాను ఆవిష్కరించారు. గ్రామంలో నిర్మించిన రాజు స్థూపానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరావు కోలా రాములు అధ్యక్షతన జరిగిన సభలో వీరయ్య మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగ బద్ధంగా కల్పించిన హక్కులను కాలరాస్తూ ప్రజా హక్కుల లేకుండా చేస్తు న్న బిజెపిని గద్దె దించడం కోసం కమ్యూనిస్టులు కృషి చేస్తున్నారని అన్నారు. మతోన్మాద బిజెపి పరిపాలనను అంతమొందించడం కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో గామాసు జోగయ్య, బేతి శ్రీనివాస రావు, చిత్తూరు కిషోర్, గౌర్రాజు రాములు, కూడెల్లి నాగేశ్వరరావు, తాళ్లూరి వెంకటనారాయణ, కోలా నాగేశ్వరరావు, దంతాల పెద్ద రాములు, ఎడ్ల సంగయ్య, వేముల వెంకటేశ్వరరావు, దంతాల నరసింహారావు, దివ్వెల వీరాంజనేయులు, వడ్డారపు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.