Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
కలెక్టర్ అనుదీప్‌తో విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు సోమవారం ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.5 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన మున్సిపల్ కార్యాలయ మ్యాప్‌ను పరిశీలించారు. అదేవిధంగా జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఇతర మౌలిక వసతుల కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించామని రేగా కాంతారావు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.